జెట్ స్పీడుతో న్యాచురల్ స్టార్

By iDream Post Mar. 07, 2020, 11:04 am IST
జెట్ స్పీడుతో న్యాచురల్ స్టార్

న్యాచురల్ స్టార్ నాని మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. స్టార్ హీరోలు ఏడాదికో సినిమా చేయడమే గగనమైపోతున్న తరుణంలో నాని మాత్రం కనీసం మూడు ఉండేలా ప్లాన్ చేసుకోవడం హర్షణీయం. ఈ నెల 25న 'వి' రిలీజ్ కు రెడీ అవుతుండగా నెగటివ్ షేడ్స్ చేసిన నాని మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉగాది అడ్వాంటేజ్ కోసం రెడీ అయ్యింది. దీని తర్వాత శివ నిర్వాణ తీయబోయే టక్ జగదీశ్ మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. దీన్నీ సమ్మర్ లోనే తీసుకురాబోతున్నారు.

రాహుల్ సంకృత్యాన్ డైరెక్టర్ గా వ్యవహరించే శ్యాం సింగ రాయ్ డిసెంబర్ లోనే వచ్చేస్తుంది. దీని తాలుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు టెక్నికల్ టీం తాలుకు ఎంపిక ప్రస్తుతం జరుగుతోంది. వీటి తర్వాత నాని చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా అప్పుడే ఓకే అవుతున్నాయి. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురాలతో మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ నాని కోసం ఒక ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టు రెడీ చేశాడు. దీన్ని మైత్రి సంస్థ నిర్మించనుంది.

గ్యాంగ్ లీడర్ టైంలోనే నానితో సెకండ్ కమిట్మెంట్ తీసుకున్న మైత్రి నిర్మాతలు ఇప్పుడు ఎలాంటి ప్రయోగాలకు పోకుండా భలే భలే మగాడివోయ్ తరహాలో నాని మార్కు ఫన్ సబ్జెక్టుని తీసుకున్నారట. ఇది కూడా వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. ఇవి కాకుండా నాని ఫైనల్ చేయాల్సిన కథలు ఇంకో రెండు లైన్లో ఉన్నాయి. స్టార్ దర్శకుల వెంట పడకుండా యూత్ డైరెక్టర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇస్తున్న నాని తన స్పీడ్ తో ఫ్యాన్స్ కి హుషారుని మార్కెట్ కి జోష్ ని ఒకేసారి ఇస్తున్నాడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp