నారప్ప ఉగ్రరూపం : ఫస్ట్ లుక్

By Ravindra Siraj Jan. 21, 2020, 10:53 pm IST
నారప్ప ఉగ్రరూపం : ఫస్ట్ లుక్

విక్టరీ వెంకటేష్ హీరోగా తమిళ్ బ్లాక్ బస్టర్ ఆసురన్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రానికి నారప్ప టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో వెంకీ స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఔట్ అండ్ ఔట్ పక్కా మాస్ విలేజ్ డ్రామా అయిన నారప్ప వెంకటేష్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి చూపిస్తుందనే నమ్మకం పోస్టర్లు కలిగిస్తున్నాయి. నారప్ప టైటిల్ కు సంబంధించి ఇవాళ ఉదయమే ఐడ్రీమ్ అందించిన కథనం నిజమయ్యింది.

అసలు ఆశ్చర్యం ఫ్యామిలీ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దీన్ని ఎలా తీర్చిదిద్దుతాడా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ ఒరిజినల్ వర్షన్ లోని ఫీల్ ని అలాగే చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. లుక్స్ విషయంలో మాత్రం వెంకీ సూపర్ అనిపించేసుకున్నారు. హీరోయిన్ ప్రియమణి సహా ఇంకెవరి లుక్స్ ఇందులో రివీల్ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత మణిశర్మ వెంకటేష్ సినిమాకు సంగీతం సమకూర్చడం విశేషం. సామాజికంగా వెనుకబడిన కులానికి చెందిన వాడిగా వెంకటేష్ మొదటిసారి ఊర మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పుడీ పోస్టర్లు అంచనాలను అమాంతం పెంచేశాయని చెప్పాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp