మూడోసారి కొరటాలను లాక్ చేసిన మైత్రి

By Satya Cine Jul. 01, 2020, 11:22 pm IST
మూడోసారి కొరటాలను లాక్ చేసిన మైత్రి

మైత్రి మూవీ మేకర్స్ వారు తమ ప్రయాణం 'శ్రీమంతుడు' సినిమాతో ప్రారంభించారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక వారి రెండో సినిమా 'జనతా గ్యారేజ్' కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మైత్రీ - కొరటాల కాంబినేషన్ మరోసారి సెట్ అయిందని టాక్ వినిపిస్తోంది.

కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల చేయబోయే ప్రాజెక్టు మైత్రీ సంస్థలోనే ఉంటుందట. ఈ సినిమా కోసం మైత్రీ వారు కొరటాలకు భారీ ఎడ్వాన్స్ ముట్టజెప్పారని సమాచారం. అయితే ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనేది మాత్రం ఇంకా తెలియదట. వందశాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కాబట్టి కొరటాల సినిమా అంటే చాలామంది హీరోలు ముందుకు వస్తారు. మరి ఎవరితో ఫిక్స్ అవుతుందనేది మాత్రం ఆసక్తికరం.

మైత్రీ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ చిత్రం కాబట్టి ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో భారీ ఆసక్తి నెలకొనడం ఖాయం. మెగాస్టార్ 'ఆచార్య' పూర్తి చేసిన తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేస్తారట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp