ఓటీటీ బాటలో ఎంఎస్ రాజు గారి బోల్డ్ మూవీ

By Satya Cine Jul. 05, 2020, 10:33 pm IST
ఓటీటీ బాటలో ఎంఎస్ రాజు గారి బోల్డ్ మూవీ

టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరుతెచ్చుకున్న ఎంఎస్ రాజుకు ఈమధ్య హిట్లు లేవు. తనయుడు సుమంత్ అశ్విన్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. అయితే చాలాకాలం తర్వాత ఆయన ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా పేరు 'డర్టీ హరి'.

ఈ సినిమాను ఎంఎస్ రాజు గారు నిర్మించడం లేదు కానీ దర్శకత్వం వహిస్తున్నారు. పేరుకు తగ్గట్టే ఈ సినిమా ఓ బోల్డ్ సినిమా. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమాలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన యూత్ ను టార్గెట్ చేస్తూ హిట్ బాట పట్టాలనే ప్రయత్నాలలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నిజానికి థియేటర్లలో విడుదల చేయాలని మొదట అనుకున్నారట కానీ థియేటర్లు అందుబాటులో లేకపోవడం, ఈ తరహా కాన్సెప్టులకు ఓటీటీలో ఆదరణ ఎక్కువగా ఉండడంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.

'చి.ల.సౌ' ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా, శ్రవణ్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాను ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందట. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజుకు సంబంధించిన ప్రకటన రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో ఎంఎస్ రాజు గారు దర్శకుడిగా తన సత్తా చాటుతారా అనేది వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp