అక్కినేని 'బ్యాచిలర్' రాబోతున్నాడు : కన్ఫర్మ్

By iDream Post Oct. 25, 2020, 11:59 am IST
అక్కినేని 'బ్యాచిలర్' రాబోతున్నాడు : కన్ఫర్మ్

అయిదేళ్ల క్రితం తెరంగేట్రం చేసినా ఇప్పటికీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని మూడో తరం రెండో వారసుడు అఖిల్ కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ దసరా పండగ సందర్భంగా విడుదలయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ ముందు కీలక దశలో షూటింగ్ ఆగిపోయిన ఈ చిత్రంలో మోస్ట్ వాంటెడ్ పూజా హెగ్డే హీరోయిన్. అప్పుడప్పుడు ఓ రెండు మూడు పోస్టర్లను రిలీజ్ చేయడం తప్ప దీనికి సంబంధించి ఎలాంటి హడావిడి లేకపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజికి చేరుకోవడంతో మొత్తానికి ఈ వీడియో రూపంలో అభిమానులకో కానుకను అందించారు.

ఇక విషయానికి వస్తే కథలో ఉద్దేశాన్ని టీజర్ లో చూచాయగా చెప్పేశారు. ఓ అబ్బాయి(అఖిల్)కి ఓ అమ్మాయంటే(పూజా హెగ్డే)అంటే ఇష్టం కలుగుతుంది. కానీ పెళ్లి విషయంలో ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కాబోయే వాడు కాలికి వేసుకునే షూతో సమానంగా ఉండాలని ఆ యువతి కోరుకుంటే ఇతనికి మాత్రం ఏవేవో ఆశలు ఉంటాయి. ఒకదశలో ఈ బ్రహ్మచారిని సైకో కూడా అనుకుంటుంది ఆ భామ. మరి ఇలా పరస్పర విరుద్ధ భావాలు ఉన్న ఈ ఇద్దరూ ఒక్కటి ఎలా అయ్యారు, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి లాంటివి తెలియాలంటే సినిమాలో చూడాలి.

టీజర్ మరీ గొప్పగా లేదు అలా అని మరీ చప్పగా లేదు. కాకపోతే కాస్త పూజా హెగ్డే డామినేషన్ ఎక్కువగా కనిపించింది. టైటిల్ కింద గొర్రెల కార్టూన్ ని పెట్టడం చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ బాగా ఫన్నీగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. బొమ్మరిల్లు రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉందో లేదో దీన్ని బట్టే చెప్పలేం. గోపి సుందర్ సంగీత అందిస్తున్న ఈ సినిమా ఆడియోలో ఇప్పటిదాకా ఒక పాట మాత్రమే విడుదలయ్యింది. ఆ మధ్య జనవరి 21 అని చెప్పిన అఖిల్ వర్షన్ కు భిన్నంగా ఈ వీడియోలో సంక్రాంతి 2021 అని చెప్పారు. సో రెడ్, అరణ్య, క్రాక్, రంగ్ దేలతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా పోటీకి సై అంటోంది.

Teaser Link @ https://bit.ly/3krZdpv

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp