సినిమాను తలదన్నే స్థాయిలో రి(న)యా ట్విస్టులు

By iDream Post Aug. 06, 2020, 07:07 pm IST
సినిమాను తలదన్నే స్థాయిలో రి(న)యా ట్విస్టులు

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కేసు విషయంలో బిహార్ పోలీసులకు దొరక్కుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన రియా చక్రవర్తి ఉదంతం సినిమాను తలదన్నే ట్విస్టులతో పరుగులు పెడుతోంది. కేసు సిబిఐకు బదలాయించడంతో ఇంకేం జరగబోతున్నాయో ఊహకు అందడం లేదు. ఇంటరిమ్ దరఖాస్తుని కోర్టు తిరస్కరించడంతో రియా ఖచ్చితంగా హాజరు కావలసిన పరిస్థితి ఏర్పడింది. తన లాయర్లు ఎంత ప్రయత్నించినా సఫలీకృతం కాలేకపోయారు. ఇప్పటికే సుశాంత్ వంటవాడు, డ్రైవర్ సన్నిహితంగా ఉండే ఇతరులను విచారించిన అధికారులు విచారణను మరింత వేగవంతం చేయబోతున్నారు.

సుశాంత్ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు నుంచే రియా నుంచి తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినట్టు కాల్ డేటాలో బయటపడినట్టుగా తెలిసింది. సోదరితో ఉన్న సుశాంత్ మళ్ళీ వస్తానని చెప్పినా కూడా ఆమె వినలేదని బలవంతంగా రప్పించిందని ఒక వెర్షన్ వినిపిస్తోంది. ఇది కాకుండా అతని మెయిల్స్ కూడా రియా డిలీట్ చేయడం ట్యామ్పర్ చేయడం లాంటివి చేసిందనే ఫిర్యాదులు కూడా చెబుతున్నారు. రేపటిలోగా అంటే ఆగస్ట్ 7న తమ ముందు హాజరు కావాలని రియా ఎన్ఫోర్సు మెంట్ డైరెక్టర్ నుంచి సమన్లు వెళ్ళాయి. ఒకవేళ ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి బయటికి రావాల్సిందే. ఒకవేళ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కనక వ్యవహారం పోలీసుల దాకా తీసుకెళ్లకపోయి ఉంటె ఇదంతా జరిగేది కాదు. కోట్ల రూపాయల తన కొడుకు డబ్బుని ఇష్టం వచ్చినట్టు వాడుకుందని ఆరోపిస్తున్న సింగ్ మాటలకు తగ్గట్టే రియా ప్రవర్తన ఉండటం గమనార్హం. విస్తుపోయే నిజాలు ఇంకా చాలా బయటికి వస్తాయని అభిమానులు అంటున్నారు.

సోషల్ మీడియాలో దీని తాలుకు చర్చ తీవ్రంగా ఉంది. తనకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని కొందరు ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. తొలుత ముంబై పోలీసుల సహకారం బీహార్ కు అందలేదని వినిపించినప్పటికీ ఇప్పుడు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి సుశాంత్ వ్యక్తిగత సమస్యలతోనో అనారోగ్యంతోనో ప్రాణాలు తీసుకోలేదు. బయట ప్రపంచం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పోయిన ప్రాణం తిరిగి రాలేకపోయినా ఇలాంటి ఘటనల్లో బాధ్యులైన వారికి శిక్ష పడేలా చేసింది కొందరిలో అయినా మార్పు వచ్చే అవకాశం ఉంది. సుశాంత్ ఆత్మకూ న్యాయం జరుగుతుంది. జరుగుతున్నదంతా గమనిస్తున్న కొందరు బాలీవుడ్ నిర్మాతలు దీన్నే సినిమాగా తీసే ఆలోచనలు గట్టిగా చేస్తున్నారు. ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరికొందరు కూడా ముందుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp