ఆఫర్లకు నో చెబుతున్న కంప్లీట్ యాక్టర్

By iDream Post Jun. 20, 2021, 07:59 pm IST
ఆఫర్లకు నో చెబుతున్న కంప్లీట్ యాక్టర్

ఎవరో ఒకరు ముందుకు రావాలి. సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే అయోమయం టెన్షన్ నుంచి నిర్మాతలు బయట పడాలంటే ధైర్యం చేసి విడుదల తేదీలు ప్రకటించాలి. అవి కూడా పెద్ద హీరోలవి జరగాలి. అప్పుడే ఇండస్ట్రీలో మిగిలినవాళ్లకు ధైర్యం వస్తుంది. థియేటర్లు తెరిచినంత మాత్రాన సరిపోదు. వాటికి కంటెంట్ కావాలి. ప్రతి శుక్రవారం కనీసం మూడు రోజలు హౌస్ ఫుల్ చేయగలిగే మూవీస్ రావాలి. జనం థియేటర్ కు వెళ్లే తీరాలి అనే ఫీలింగ్ వచ్చేలా ప్రమోషన్ జరగాలి. నిజంగా మాటకు కట్టుబడతామా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు ప్రతిదీ అనుకున్నట్టే జరగాలని లేదు. ముందడుగైతే పడాలి కదా.

ఈ విషయంలో మోహన్ లాల్ కొత్త సినిమా టీమ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. మలయాళం సినిమా చరిత్రలో అత్యంత భారీ చిత్రంగా రూపొందిన మరక్కర్ లయన్ అఫ్ అరేబియన్ సిని ఆగస్ట్ 12 విడుదలకు లాక్ చేయడం డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. ఇందులో మనకూ బాగా పరిచయమున్న అర్జున్ సర్జా, కీర్తి సురేష్, సునీల్ శెట్టి లాంటి క్యాస్టింగ్ ఉన్నారు. బాహుబలి రేంజ్ లో కేరళలో దీని మీద అంచనాలు ఉన్నాయి. గత ఏడాది విభాగంలోనే దీనికి నేషనల్ అవార్డు కు వచ్చింది. మొన్న మే 13 ఆచార్యకు పోటీగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఫైనల్ గా అందరి ప్లాన్లకు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.

మరక్కర్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ప్రచారంలో ఉంది. దీని ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ అడిగిందట. రిలీజైన 28 రోజులకే స్ట్రీమింగ్ కి కనక ఒప్పుకుంటే సుమారు 70 కోట్ల దాకా ఆఫర్ చేశారని టాక్ ఉంది. కానీ నిర్మాతలు మాత్రం 45 రోజుల వ్యవధి ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అలా చేస్తే రేట్ తగ్గినా పర్వాలేదని అన్నట్టు వినికిడి. ఇది ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకొద్ది రోజులు ఆగి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. సముద్రం నేపథ్యంలో అరబిక్ సితో నడిపే కథగా మరక్కర్ గురించి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా మన తెలుగు పెద్ద హీరో ఎవరో ఒకరు క్లాష్ కాక తప్పేలా లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp