చిరు వెంకీలతో మోహన్ లాల్ ఢీ

By iDream Post Mar. 01, 2021, 02:53 pm IST
చిరు వెంకీలతో మోహన్ లాల్ ఢీ

ఎప్పుడు లేనంత విపరీతమైన పోటీ మధ్య 2021 బాక్సాఫీస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతివారం కనీసం నాలుగైదు సినిమాలు క్లాష్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. వసూళ్ల పరంగా ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే అయినా నిర్మాతలకు వేరే ఆప్షన్ లేకుండా పోతోంది. ఆలస్యం చేసేకొద్ది పెట్టుబడుల భారం పెరిగిపోవడం కూడా ఒక కారణం. అయితే ఇది చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలకే పరిమితం కాలేదు. స్టార్ హీరోలు మల్టీ స్టారర్లకు సైతం ఈ ఇబ్బంది తప్పడం లేదు. తాజాగా ఈ రేస్ లో మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా జాయినయ్యారు. నేను సైతం అంటూ మల్టీ స్టారర్ తో మన సినిమాలకు సవాల్ విసురుతున్నారు.

గత ఏడాదే విడుదల కావాల్సిన మల్లు వుడ్ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ 'మరక్కర్ లయన్ అఫ్ అరేబియన్ సీ' మే 13 విడుదలను అఫీషియల్ గా లాక్ చేసుకుంది. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి ఆచార్యను గతంలోనే ప్రకటించారు. సో రెండు బాషలకు చెందిన దిగ్గజాలు ఒకేరోజు పోటీ పడబోతున్నాయన్న మాట. మోహన్ లాల్ కు ఇక్కడ మార్కెట్ తక్కువ కదాని తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే మరక్కర్ మల్టీ స్టారర్. కీర్తి సురేష్, యాక్షన్ కింగ్ అర్జున్, సునీల్ శెట్టి, మంజు వారియర్, అశోక్ సెల్వన్, ప్రభు, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. పైగా గ్రాఫిక్స్ కి భారీ ప్రాధాన్యం కల్పించారు.

అందులోనూ మోహన్ లాల్ ప్రియదర్శన్ ల కాంబో ఇండియన్ ఫిలిం హిస్టరీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జంట. ఇప్పటిదాకా వీళ్ళు పాతిక సినిమాలు పైగానే చేశారు. అందులో ఈ మరక్కర్ చాలా ప్రత్యేకతలతో వస్తున్నది. జానపద గాధలను తలపించే రియల్ ఫాంటసీతో వస్తున్న మరక్కర్ ఇతర రాష్ట్రాల్లో ఆచార్యకు థ్రెట్ గా మారతాడు. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో టఫ్ కాంపిటీషన్ అవుతుంది. నిజానికి ఈ మరక్కర్ ప్లాన్ చేసుకున్నది మార్చి 26. కానీ ఏవో కారణాల వల్ల మనసు మార్చుకున్నారు. అదే టైంలో మే 14న వెంకటేష్ నారప్ప కూడా లాక్ అయ్యి ఉంది. సో పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp