సలార్ మీద మాస్టర్ ప్రభావం

By iDream Post Jan. 24, 2021, 03:51 pm IST
సలార్ మీద మాస్టర్ ప్రభావం

సంక్రాంతికి విడుదలైన మాస్టర్ టాక్ సంగతి ఎలా ఉన్న ఫైనల్ గా కోట్లాది రూపాయలు వసూలు చేసుకుని ఎంచక్కా బ్లాక్ బస్టర్ ముద్ర అందుకుంది. పది నెలలకు పైగా స్టార్ హీరో సినిమా లేని కరువుని ఫుల్ గా వాడుకుంది. కంటెంట్ ఎలా ఉన్నా పర్లేదు అనుకుని హీరో విలన్ కాంబినేషన్ కోసం జనం పోటెత్తారు. ముఖ్యంగా తమిళనాడులో మాస్టర్ మీద కనక వర్షం కురిసింది. తెలుగులోనూ బాగా సేఫ్ అయ్యింది. లాభాలు కూడా ఇచ్చింది. క్రాక్, రెడ్ తర్వాత అల్లుడు అదుర్స్ ని పక్కకు నెట్టేసి మరీ మాస్టర్ బెటర్ అనిపించుకుంది. ఇప్పుడైతే వసూళ్లు నెమ్మదించాయి కానీ ఇప్పటికే రావాల్సినదాని కన్నా ఎక్కువే వచ్చింది.

దీనికి సలార్ కు లింక్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. మాస్టర్ లో విజయ్ కన్నా ఎక్కువగా విజయ్ సేతుపతి క్యారెక్టర్, అతని విలనీ బాగా హై లైట్ అయిన సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే ఒక వర్గాన్ని అంతో ఇంతో మెప్పించింది ఈ ట్రాకే అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి తను బాగా కనెక్ట్ అయిపోయాడు. అందుకే ఉప్పెన మీద బజ్ పెరగడానికి తను కూడా ఒక కారణం కాబోతున్నాడు. అందుకే ప్రభాస్ సలార్ లో కూడా శక్తివంతమైన విలన్ పాత్రను విజయ్ సేతుపతితోనే చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది అధికారికంగా చెప్పలేదు కానీ చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది.

ఒకవేళ నిజమైతే మంచిదే. సై అంటే సై అనే ప్రభాస్ విజయ్ సేతుపతిల పోరుని బాహుబలి రేంజ్ లో చూడొచ్చు. అసలే ఎలివేషన్లు డీల్ చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు మూడు సినిమాలకే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ ని ఎలా చూపిస్తాడో వేరే చెప్పాలా. దాదాపు కెజిఎఫ్ కు పనిచేసిన టీమ్ దీనికి కూడా వర్క్ చేయబోతోంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. హీరోయిన్ గా దిశా పటానిని ఎంచుకున్నట్టు టాక్ వచ్చింది కానీ అది నిజం కాదట. ఇంకా ఆప్షన్లు చూస్తూనే ఉన్నారని వినికిడి. వచ్చే నెల అన్నీ ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp