మాస్ రాజా స్టైల్ లో పోలీస్ 'క్రాక్'

By Ravindra Siraj Feb. 22, 2020, 10:37 am IST
మాస్ రాజా స్టైల్ లో పోలీస్ 'క్రాక్'

ఈ ఏడాది ప్రారంభంలో డిస్కోరాజా తో షాక్ తిన్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా క్రాక్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇటీవలే రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ముందే ప్రకటించిన రిలీజ్ డేట్ మే 8కు తగ్గట్టు అప్పుడే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశారు. అందులో భాగంగానే నిన్న టీజర్ రిలీజ్ చేసింది టీమ్. చూచాయగా కథేంటో చిన్న క్లూస్ ఇచ్చారు.

ఒంగోలులో రాత్రి 8 సమయంలో కరెంట్ పోతే మర్డర్లు జరుగుతుంటాయి. ఓ గుర్తు తెలియని ముఠా వాటికి పాల్పడుతూ ఉంటుంది. ఆ సమయంలో రంగంలోకి దిగుతాడు పోలీస్ ఆఫీసర్ వీర శంకర్(రవితేజ). రాగానే వేట మొదలుపెడతాడు. దాని వెనుక జాలర్ల గ్యాంగ్ తో పాటు వాటి నాయకుడు(సముతిరఖని)ఇంకో లేడీ డాన్(వరలక్ష్మి శరత్ కుమార్) ఉన్నట్టు తెలుస్తుంది. పెద్ద పద్మవ్యూహంలా కనిపిస్తున్న ఈ క్రైంని వీర శంకర్ ఎలా అడ్డుకున్నాడు, తన భార్య(శృతి హాసన్)కు సంబంధించిన కథేంటి లాంటి విషయాలన్నీ తెరమీదే చూడాలన్న మాట

చాలా కాలం తర్వాత రవితేజ తన బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే ప్లాట్ ను ఎంచుకున్నాడు. కోర మీసంతో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యే స్లాంగ్ తో డైలాగ్ డెలివరీలోనూ తన మార్కు చూపించాడు. ఆల్రెడీ రవితేజతో రెండు హిట్లు అందుకున్న గోపిచంద్ మలినేని మరోసారి తన హీరోకు తగ్గట్టు పవర్ ఫుల్ సబ్జెక్టును తీసుకున్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, క్రైమ్ బ్యాక్ డ్రాప్ ని క్యారీ చేసే విధంగా సెట్ చేసిన కలర్ టోన్ మొత్తానికి క్రాక్ మీద అంచనాలు పెరిగేలా చేశాయి. ట్రైలర్ వచ్చాక క్లారిటీ ఇంకా పెరుగుతుంది. నాలుగు ఫ్లాపులతో డీలాగా ఉన్న రవితేజ అభిమానుల కోరికకు తగ్గట్టు క్రాక్ రూపొందినట్టు కనిపిస్తోంది. ఆ అంచనాలు నిలబెట్టుకుంటే ష్యుర్ షాట్ హిట్ కొట్టినట్టే.

Watch Teaser Here @ bit.ly/39Z8vnz

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp