మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్స్

By iDream Post Jul. 11, 2020, 09:37 pm IST
మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు 44 ఏళ్ళు అయినా మహర్షి లాంటి సినిమాల్లో కాలేజీకి వెళ్తుంటే నమ్మబుద్ది వేస్తుంది. అది తన గ్లామర్ మహత్యం. ఏళ్ళు గడిచే కొద్దీ టైం మెషీన్ లో వెనక్కు వెళ్లినట్టు నవ యవ్వనంగా ఉండే ప్రిన్స్ కి ఎవర్ హ్యాండ్ సం అనే పదం నూరు శాతం సరిపోతుంది. చిన్న వయసులోనే తెరమీద తన సత్తా చాటి ఇప్పుడు వంద కోట్ల మార్కెట్ దాటిన రేంజ్ కు చేరుకోవడంలో మహేష్ చేసిన కృషి ఎంతైనా ఉంది. అయితే ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటనే ఆసక్తి అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ కలగడం సహజం . దానికి సంబంధించిన క్లారిటీ సోదరి మంజుల ఓ సందర్భంలో ఇచ్చారు.

ఘట్టమనేని కుటుంబంలో దాదాపు అందరూ ఫిట్ నెస్ కి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళే . ముఖ్యంగా మంజుల ఆర్గానిక్ వెజిటబుల్స్ ని ఇష్టపడతారు. క్రిమిసంహారక మందులు వాడకుండా సహజంగా పండించే కాయగూరలు శరీరాన్ని ఎక్కువ కాలం మన్నేలా చేస్తాయి. దేహమే దేవాలయం అనే సూత్రాన్ని గుర్తు పెట్టుకుని దానికి తగ్గట్టు కేర్ తీసుకుంటే లక్షలకు లక్షలు హాస్పిటల్ కు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అయితే సాధారణ పబ్లిక్ లో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఆర్గానిక్ వెజిటబుల్స్ ఖరీదు ఎక్కువ. అందులో కొంత నిజం ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మాత్రం వ్యయం చేయక తప్పదు.

పైగా బయట షాపింగ్ పేరుతో మనం చేసే ఎంతో వృధా ఖర్చు కంటే ఇది అంత కష్టమేమీ కాదు.ఇక మహేష్ విషయానికి వస్తే ఫిజికల్ ఫిట్ నెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టే సూపర్ స్టార్ దానికి తగ్గట్టే వర్క్ అవుట్స్, డైట్ ప్లాన్స్ పక్కాగా ఫాలో అవుతారు. ఇటీవలే తన సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని వీడియోలు చూస్తే ఇది గమనించవచ్చు. సర్కారు వారి పాట కోసం కొత్త మేకోవర్ తో ఆకట్టుకుంటున్న మహేష్ ఇంకో ఆరేళ్ళలో హాఫ్ సెంచరీ వయసులోకి అడుగుపెట్టినా ఇదే తరహా గ్లామర్ తో మేజిక్ చేయడం ఖాయం. నిన్నటి తరంలో నాగార్జున ఇప్పటి జెనరేషన్ లో మహేష్ బాబు ఈ విషయంలో అందరి కన్నా ముందున్న మాట వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp