ఎన్టీఆర్ కు ఫైట్ కు మంచు మనోజ్ రెడీ?

By Satya Cine Jul. 03, 2020, 10:26 pm IST
ఎన్టీఆర్ కు ఫైట్ కు మంచు మనోజ్ రెడీ?

ఈమధ్య టాలీవుడ్ లో మల్టిస్టారర్ సినిమాలు ఎక్కువయ్యాయి. ఇక కొందరు హీరోలు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి సై అంటున్నారు. 'మహర్షి' సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తే, నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాలో యువ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ కూడా ఒక క్రేజీ సినిమాలో విలన్ పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో #ఎన్టీఆర్30 చిత్రం ప్రకటన చాలారోజుల క్రితమే వచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న 'RRR' షూటింగ్ పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకోసం మనోజ్ ను సంప్రదించారని, మనోజ్ కూడా ఓకె చెప్పాడని అంటున్నారు. రియల్ లైఫ్ లో ఎన్టీఆర్, మనోజ్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. పైగా ఇది క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో మనోజ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.

మనోజ్ ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించారు కానీ ఇలా ఇతర సినిమాల్లో కీలక పాత్రలు పోషించలేదు. ఒకవేళ ఇది నిజమే అయిన పక్షంలో #ఎన్టీఆర్30 సినిమాకు మంచు మనోజ్ ప్రధాన ఆకర్షణగా మారతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp