అమాయకుల కోసం సైనికుడి తెగింపు

By iDream Post Apr. 12, 2021, 04:25 pm IST
అమాయకుల కోసం సైనికుడి తెగింపు

క్షణం, గూఢచారి, ఎవరు లాంటి విలక్షణమైన సినిమాలతో కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా విజయాలు సాధిస్తున్న అడవి శేష్ కొత్త సినిమా మేజర్. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యమయినా ఎట్టకేలకు పూర్తి చేసి త్వరలోనే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. గూఢచారితో డీసెంట్ బడ్జెట్ లోనూ సూపర్బ్ యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించిన తీరు దర్శకుడు శశి కిరణ్ తిక్కకు చాలా పేరు తీసుకొచ్చింది. మేజర్ కెప్టెన్ కూడా ఇతనే కావడంతో అంచనాలు అంతకు మించి పెరిగిపోయాయి. ఇందాక మహేష్ చేతుల మీదుగా టీజర్ ని రిలీజ్ చేశారు.

చిన్నప్పటి నుంచే సైనిక విన్యాసాలు చూసిన ఉన్నికృష్ణన్(అడవి శేష్)కు పెద్దయ్యే కొద్దీ ఎలాగైనా సైనికుడిగా మారి దేశం కోసం సేవ చేయాలనే లక్ష్యం ఏర్పడుతుంది. తండ్రి(ప్రకాష్ రాజ్)ఎందుకని అడిగినా స్పష్టంగా సమాధానం చెప్పేంత తెగువ ఇతనికి ఉంటుంది. మేజర్ గా గ్రేడ్ పొందాక 2008లో టెర్రరిస్టులు ముంబై తాజ్ హోటల్ మీద పంజా విసిరి వందలాది ప్రాణాలను బలి పెట్టేందుకు తెగబడినప్పుడు ఆ మిషన్ లో ఉంటాడు ఉన్నికృష్ణన్. చావుకు భయపడకుండా వాళ్ళను అంతమొందించే లక్ష్యంతో బరిలో దిగుతాడు. ఇక ఆపై జరిగే మాటలకందని సాహసమే మేజర్ సినిమా కథాంశం

అంచనాలకు మించిన విజువల్స్ తో మేజర్ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ పాయింట్ తో గతంలో వర్మ లాంటి దర్శకులు సినిమాలు తీసినప్పటికి వాటిలో లేని ఇంటెన్సిటీ, సహజత్వం ఇందులో కనిపిస్తోంది. మేజర్ ఉన్నికృష్ణన్ గా అడవి శేష్ తనను తాను మేకోవర్ చేసుకున్న తీరు చాలా బాగుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ, శోభిత, సయీ మంజ్రేకర్ లను ఒక్కో ఫ్రేమ్ లో చూపించారు. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం, వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం సబ్జెక్టు డిమాండ్ చేసిన డెప్త్ ని సంపూర్ణంగా అందించాయి. మొత్తానికి ఏదైతే కోరుకున్నారో దానికి మించి అనేలా ఆసక్తిని రెట్టింపు చేశాడు మేజర్

Teaser Link @ https://bit.ly/3mGr5Iz

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp