నిర్ణయం తీసుకున్న నితిన్ టీమ్ ?

By iDream Post Jun. 19, 2021, 05:00 pm IST
నిర్ణయం తీసుకున్న నితిన్ టీమ్ ?

థియేటర్లు తెరుచుకోబోతున్నాయి కానీ తెరవెనుక కొన్ని సినిమాల ఓటిటిల డీల్స్ యథావిధిగా జరుగుతున్నాయి. పరిస్థితి ఇప్పట్లో నార్మల్ కావడం కష్టమే కానీ నైట్ కర్ఫ్యూ తీసేసి సెకండ్ షోలకు అనుమతులు వచ్చేందుకు మాత్రం ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. థర్డ్ వేవ్ ప్రచారం జరుగుతోంది కాబట్టి యాభై శాతం ఆక్యుపెన్సీతోనే హాళ్లు నడుపుకోక తప్పదు. అందుకే భారీ చిత్రాలు తమ డేట్లను ప్రకటించేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ నటించిన మాస్ట్రో డిజిటల్ ప్రీమియర్ ప్రయత్నాల్లో ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటిటి సంస్థ ఒకటి భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్టుగా చెబుతున్నారు.

ఇదే తరహా ప్రచారం పాగల్ విషయంలోనూ జరుగుతోంది కానీ దీన్ని ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక మాస్ట్రో సంగతి చూస్తే కేవలం కొద్దిభాగం మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టేశారు. మరికొద్ది రోజుల్లో గుమ్మడికాయ కూడా కొట్టేస్తారు. మరి థియేటర్ల కోసం వేచి చూడకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారా అనే అనుమానం కలగొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం ఏ మేరకు సినిమాల కోసం బయటికి వస్తారన్నది అనుమానంగా ఉంది. వినోదం కోసం రిస్క్ చేసి మరీ కుటుంబాలతో సహా వస్తారా అనే అనుమానం ఇప్పటికీ ఇండస్ట్రీలో లేకపోలేదు

ఇది నిజమైనా కాకపోయినా మాస్ట్రో యూనిట్ రిలీజ్ కు సంబంధించి ఏదైనా క్లారిటీ ఇస్తే బెటర్. బాలీవుడ్ సూపర్ హిట్ అందాదున్ రీమేక్ గా రూపొందిన మాస్ట్రోలో నితిన్ మొదటిసారి కళ్లులేని వాడిగా నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ కావడం, తమన్నా నెగటివ్ రోల్ చేయడం లాంటివి ఆసక్తిని పెంచుతున్నాయి. వాస్తవానికి రెగ్యులర్ గా హిందీ సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళు అందాదున్ ని ఎప్పుడో చూశారు. దాని తాలూకు రివ్యూలు కూడా వైరల్ అయ్యాయి. మరి మాస్ట్రో థియేటర్లో వస్తాను అంటాడా లేక ఇప్పుడీ న్యూస్ లీకైనట్టు జై ఓటిటి అంటాడా అనేది టీమ్ తరఫున ఎవరో ఒకరు చెప్పే దాకా క్లారిటీ రాదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp