లవ్ స్టోరీ టార్గెట్ అప్పుడే అయిపోలేదు

By iDream Post Sep. 29, 2021, 02:30 pm IST
లవ్ స్టోరీ టార్గెట్ అప్పుడే అయిపోలేదు

అన్నీ మంచి శకునములే తరహాలో కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిన లవ్ స్టోరీ స్పీడ్ కి ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. ఉన్నట్టుండి వసూళ్లు నెమ్మదించడం ట్రేడ్ ని ఖంగారు పెడుతోంది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 10 కోట్ల దాకా రావాల్సి ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు నిశ్చింతగా ఉండటానికి లేదు. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న గులాబ్ తుఫాను వర్షాలు చాలా ప్రాంతాల్లో కలెక్షన్లను దెబ్బ కొడుతున్నాయి. నిన్న తెలంగాణలో సెలవు ప్రకటించినా లాభం లేకపోయింది. ట్రాఫిక్ లో ఇరుక్కుంటామనే భయంతో సినిమా కోసం బయటికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ.

రెవిన్యూ చాలా కీలకమైన వైజాగ్ లాంటి నగరాల్లో సైతం ఈ సమస్య ఉండటంతో అయిదో రోజు కేవలం 1 కోటి 25 లక్షలు మాత్రమే షేర్ వచ్చినట్టు రిపోర్ట్. రిలీజైనప్పటి నుంచి ఇదే తక్కువ మొత్తం. ఒకవేళ పరిస్థితి నార్మల్ గా ఉంటే ఖచ్చితంగా ఇంకో నలభై లక్షలకు పైగా అదనంగా వచ్చేదని అంటున్నారు. లవ్ స్టోరీకి రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా లేకపోవడం కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తోంది. గతంలో ఫిదా లాంటి వాటికి మాస్ ఆడియన్స్ ఎక్కువగా వచ్చారు. అలా చూసుకుంటే ఈ సినిమాకు అది తగ్గింది. ప్రమోషన్లను మాత్రం టీమ్ జోరుగా చేస్తోంది. నిన్న నాగార్జున అతిథిగా గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్ కూడా చేశారు

ఇప్పుడు శుక్రవారం రాబోతున్న సాయి తేజ్ రిపబ్లిక్ టాక్ ఈ వీకెండ్ లవ్ స్టోరీ వసూళ్లను ప్రభావితం చేస్తుంది. పాజిటివ్ గా వస్తే ఇంకా తగ్గుదల ఉంటుంది. లేదూ అంటే సగటు ప్రేక్షకులకు లవ్ స్టోరీనే ఓన్లీ ఆప్షన్ గా మిగులుతుంది. ఇంకో పది కోట్ల షేర్ రావాలంటే సుమారుగా ఇరవై కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇకపై అదంత ఈజీ టాస్క్ గా కనిపించడం లేదు. ఏపిలో సగం ఆక్యుపెన్సీనే ఉన్నప్పటికీ ఎక్కువ స్క్రీన్లు వేయడంతో రావల్సిన మొత్తంలో మరీ ఎక్కువ తేడాలు లేవు కానీ అసలైన సవాల్ మాత్రం ఈ వారం పది రోజులు అని చెప్పాలి. టార్గెట్ చేరుకోకపోతే మాత్రం బ్లాక్ బస్టర్ ముద్ర మిస్ అవుతుంది

Also Read : రౌడీ అల్లుడు జంట కలవనుందా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp