అప్పుడే చిన్నితెరపై లవ్ స్టోరీ

By iDream Post Oct. 11, 2021, 12:30 pm IST
అప్పుడే చిన్నితెరపై లవ్ స్టోరీ

సెకండ్ లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ స్టోరీ త్వరలోనే ఓటిటిలో రాబోతోంది. అక్టోబర్ 22న ప్రీమియర్ చేయబోతున్నట్టు అనఫీషియల్ టాక్. ఆహా దీని హక్కులు కొన్న సంగతి తెలిసిందే. రెండు వారాలకే బ్రేక్ ఈవెన్ 30 కోట్ల షేర్ ని దాటేసిన ఈ ప్రేమకథను డిజిటల్ ఫార్మాట్ లో వీక్షించేందుకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులు భారీగా ఉన్నారు. గత నెల 24న రిలీజైన లవ్ స్టోరీ ఇప్పుడీ వార్త నిజమైతే ఇరవై ఎనిమిది రోజులకే స్మార్ట్ స్క్రీన్ లో వచ్చేసినట్టు. ఇప్పటికీ ఏ సెంటర్స్ వీకెండ్స్ కి హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే జనానికి ఇది ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి.

మొత్తం 17 రోజులకు కలిపి లవ్ స్టోరీ ఇప్పటిదాకా 33 కోట్ల 30 లక్షల షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. గ్రాస్ లో చూసుకుంటే 60 కోట్లకు దగ్గర ఉన్నట్టు. అంటే ఇండియా వైడ్ ఏ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. మొన్న విడుదలైన తమిళనాడులో మంచి టాక్ తో నడుస్తున్న డాక్టర్ ఈ మార్కు అందుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి కానీ ఇంకో వారం రోజులు ఆగితే కానీ ఖచ్చితంగా చెప్పలేం. దసరాకు వరసగా సినిమాలు ఉన్న నేపథ్యంలో ఇక లవ్ స్టోరీ లాంగ్ రన్ దక్కించుకోవడం కష్టం. మహా సముద్రం, పెళ్లి సందడి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లు భారీ ఓపెనింగ్స్ ని ఆశిస్తున్నాయి.

సరైన టైమింగ్ తో రిలీజ్ అయిన లవ్ స్టోరీ దానికి మించిన ఫలితాన్ని అందుకుంది. పోటీ లేకపోవడం, ఆరు నెలల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకే ఆప్షన్ గా కనిపించడం లాంటివి బాగా ప్లస్ అయ్యాయి. సాయి పల్లవి ఇమేజ్, సారంగదరియా పాట, నాగ చైతన్య మార్కెట్ ఇవన్నీ చాలా సానుకూలంగా పని చేశాయి. భారీ సినిమాల ప్రీమియర్లతో పెద్ద స్కెచ్ వేస్తున్న ఆహాకు లవ్ స్టోరీకి వచ్చే రెస్పాన్స్ ఇంకో లెవెల్ లో ఉంటుందని అంచనా.ఈ ఏడాది క్రాక్, జాంబీ రెడ్డి లాంటి సినిమాలతో గట్టి పోటీ ఇస్తున్న ఆహాకు ప్రైమ్ కు ధీటుగా హక్కుల కోసం పెట్టుబడులు పెట్టడం గమనార్హం.

Also Read : అబ్బాయిని మరిపించేలా బాబాయ్ మేజిక్ చేయాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp