లవ్ స్టోరీ 3 రోజుల కలెక్షన్లు ఎంతొచ్చాయి

By iDream Post Sep. 27, 2021, 06:30 pm IST
లవ్ స్టోరీ 3 రోజుల కలెక్షన్లు ఎంతొచ్చాయి

మొదటి వీకెండ్ ని లవ్ స్టోరీ బ్రహ్మాండంగా ముగించింది. విడుదలకు ముందు థియేట్రికల్ బిజినెస్ ని ఈజీగా దాటుతుందా లేదా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ కేవలం మూడు రోజులకే డెబ్బై శాతం పైగా పెట్టుబడిని వెనక్కు తెచ్చి తెలుగు ప్రేక్షకుల సంసిద్ధతను మరోసారి బాక్సాఫిస్ కు చాటింది. పోటీ సినిమాలు ఏవీ లేకపోవడం, శేఖర్ కమ్ముల టేకింగ్, సాయి పల్లవి మేజిక్, నాగ చైతన్య పెర్ఫార్మన్స్ మొత్తానికి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించాయి. ముఖ్యంగా ఏ సెంటర్లలో రెస్పాన్స్ చాలా బాగుంది. మల్టీ ప్లెక్సులన్నీ అడ్వాన్స్ బుకింగ్ లోనే ఫుల్ అవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సింగల్ స్క్రీన్స్ కూడా జోరుగా ఉన్నాయి.

ట్రేడ్ నుంచి వచ్చినట్టుగా చెబుతున్న రిపోర్ట్ ప్రకారం లవ్ స్టోరీ మూడు రోజులకు కలిపి 22 కోట్లకు పైగానే షేర్ తెచ్చింది. ఇది సెకండ్ లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద రికార్డు. హిందీ సినిమాలకు వరల్డ్ వైడ్ గానూ ఇంత మొత్తం వసూలు కాలేదు. అసలు డబ్బింగ్ వెర్షన్ లేకుండా ఒక రీజనల్ లాంగ్వేజ్ మూవీ ఈ స్థాయిలో రాబట్టుకోవడం చిన్న విషయం కాదు. ఏపిలో సగం సీట్లతోనే ఇంత భారీ ఫిగర్లు నమోదు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకవేళ ఫుల్ కెపాసిటీ అయ్యుంటే ఈపాటికే బ్రేక్ ఈవెన్ అయ్యుండేది. టికెట్ రేట్లు కూడా పెంచకుండా ఉంచిన ధరలలోనూ ఈ కలెక్షన్లు ధైర్యాన్ని ఇచ్చేవే

నైజాం - 8 కోట్ల 15 లక్షలు
సీడెడ్ - 2 కోట్ల 71 లక్షలు
ఉత్తరాంధ్ర - 1 కోటి 98 లక్షలు
ఈస్ట్ గోదావరి - 1 కోటి 5 లక్షలు
వెస్ట్ గోదావరి - 94 లక్షలు
గుంటూరు - 1 కోటి 14 లక్షలు
కృష్ణా - 87 లక్షలు
నెల్లూరు - 54 లక్షలు

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మూడు రోజుల వసూళ్లు - 17 కోట్ల 38 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా - 92 లక్షలు
ఓవర్సీస్ - 3 కోట్ల 75 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల షేర్ - 22 కోట్ల 5 లక్షలు

బ్రేక్ ఈవెన్ కు ఇంకో 10 కోట్లు వస్తే లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిపోతుంది. చూస్తుంటే అదేమంత అసాధ్యంగా అనిపించడం లేదు. ఈ శుక్రవారం సాయి తేజ్ రిపబ్లిక్ ఒకటే వస్తోంది. సీరియస్ పొలిటికల్ డ్రామా కావడంతో వచ్చే వీకెండ్ కి ఫామిలీస్ దీనివైపు టర్న్ కావడం టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నుంచి డ్రాప్ ఏ శాతం ఉంటుందనేది కూడా లవ్ స్టోరీ భవితవ్యాన్ని నిర్ణయించబోతోంది. ఫుల్ రన్ లో దీని టార్గెట్ ఇప్పుడు ఉప్పెన, జాతిరత్నాలు మీదే ఉంది. అది కష్టమేమి కాదు. మొత్తానికి ఇంతకాలం వేచి చూసినందుకు దానికి తగ్గ ఫలితమైతే లవ్ స్టోరీ అందుకుందనే చెప్పాలి

Also Read : పవన్ సినిమా ఓటిటి రిలీజ్ : ఇది క్లారిటీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp