టాలీవుడ్ ప్రేమలో ఫిబ్రవరి నెల

By Ravindra Siraj Jan. 27, 2020, 06:35 pm IST
టాలీవుడ్ ప్రేమలో ఫిబ్రవరి నెల

కొత్త ఏడాదిలో అప్పుడే మొదటి నెల పూర్తి కావొస్తోంది. సినిమా పరిశ్రమ వరకు జనవరి అద్భుత ఫలితాలను ఇచ్చింది. అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డులు సాధించగా సరిలేరు నీకెవ్వరు సైతం వంద కోట్లకు పైగా షేర్ తో శభాష్ అనిపించుకుంది. కాకపోతే ఎన్నో అంచనాలతో వచ్చిన రవితేజ డిస్కో రాజా మాత్రం నిరాశపరిచింది. ఇక 31న అశ్వద్ధామతో ఫస్ట్ మంత్ కోలాహలం ముగిసిపోతుంది.

ఇకపై వచ్చే ఫిబ్రవరికో ప్రత్యేకమైన విశేషం ఉంది. ప్రేమికుల రోజు ఉండే నెలగానే కాకుండా విడుదల కాబోతున్న క్రేజీ సినిమాలన్నీ ప్రేమ కథలే కావడం అసలు ట్విస్ట్. మొదటగా వచ్చేది 7న రిలీజ్ కానున్న శర్వానంద్ సమంతాల జాను. తమిళ్ క్లాసిక్ హిట్ 96 రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా సంపూర్ణంగా ప్రేమ మయమే. అదే రోజు ప్లాన్ చేసిన సవారి కూడా లవ్ స్టొరీనే. నందు హీరోగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆపై వారం 14 వాలెంటైన్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ రాబోతోంది . ఇందులో ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్రేమకథలు ఉంటాయట.

అటుపై 21న నితిన్ భీష్మ వస్తుంది. ఇది కూడా లవ్ స్టొరీనే. రష్మిక మందన్న హీరొయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ టీజర్ తోనే వచ్చేసింది. దానికన్నా ఒక్క రోజు ముందు వచ్చే అనుష్క నిశబ్దం థ్రిల్లర్ అయినప్పటికీ అందులోనూ మంచి లవ్ ఫీల్ ఉంటుందట. ఇక ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం అంటే 28 మాత్రం ప్రేమకు మినహాయింపు ఇచ్చేశారు. విశ్వక్సేన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్ రాబోతోంది. ఇది మాత్రం ప్రేమకథ కాదు. సో మొత్తంగా నాలుగింట్లో మూడు శుక్రవారాలు ఫిబ్రవరిలో ప్రేమతో నిండిపోనున్నాయి. ఇంకేం యూత్ కు అంతకంటే కావలసింది ఏముంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp