లోడ్ ఎత్తే రమణ మహా గట్టోడు

By Ravindra Siraj Jan. 21, 2020, 05:18 pm IST
లోడ్ ఎత్తే రమణ మహా గట్టోడు

ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరులో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సేతురామన్ అనే నటుడు చెప్పిన లోడ్ ఎత్తాలి రమణ అనే డైలాగ్ బాగా పేలింది. చెక్ పోస్ట్ పడతాది అంటూ సీమ యాసలో చెప్పిన ఆ ఒక్క లైన్ కే జనం కనెక్ట్ అయిపోయారు. ఎంతగా అంటే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్టేజి మీద పిలిచి ప్రత్యేకంగా గౌరవించేంత. అయితే ఈ సేతురామన్ ప్రేక్షకులకు కొత్త కాని పరిశ్రమకు కాదు . అతనికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Read Also: తారల సెకండ్ ఇన్నింగ్స్ ఏం చెబుతున్నాయి

వివరాల్లోకి వెళ్తే అతని పూర్తి పేరు కుమనన్ సేతురామన్. కెరీర్ మొదట్లో సర్వీస్ ఇంజనీర్ గా చేసి సినిమాల మీద ప్రేమతో ఈ రంగంలో స్టిల్ ఫోటో గ్రాఫర్ గా మారాడు. అది మొదలు స్టార్లతో పరిచయాలు మొదలయ్యాయి. మేఘం మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆపై వెంకీ. స్టాలిన్, ధైర్యం లాంటి సినిమాల్లో చిన్నా చితక వేషాలు వేశారు కాని ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్నాళ్ళు ప్రజారాజ్యం పార్టీలో సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉద్యోగం చేసిన సేతురామన్ ఆ తర్వాత అరవింద్ 2లో మెయిన్ విలన్ గా చేశారు కాని రిజల్ట్ నెగటివ్ గా వచ్చింది.

Read Also: ట్రిపుల్ మార్కు దాటేసిన బంటు

గత ఏడాది దసరాకు రిలీజైన సైరాలో కూడా కనిపించారు. సేతురామన్ వయసు 60 సంవత్సరాలు. ఇప్పటికీ బాడీ ఫిట్ నెస్ ని మైంటైన్ చేస్తూ రోజు కసరత్తులు చేయబట్టే ఆయనలో ఆ ఛాయలు కనిపించవు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే సేతురామన్ జిమ్ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. మొత్తానికి ఇరవై ఏళ్ళు కష్టపడుతున్నా రాని గుర్తింపు ఒక్క డైలాగ్ తో వచ్చిందని సేతురామన్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. ఇప్పుడు ఆఫర్లు బాగా వస్తున్నాయట. సో ఒక సినిమానే కాదు ఒక్కోసారి ఒక డైలాగ్ కూడా జీవితాన్ని మార్చేస్తుందన్న మాట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp