లెజెండ్ విలన్ ఫ్రెండ్ గా మారాడా

By iDream Post Mar. 08, 2021, 05:38 pm IST
లెజెండ్ విలన్ ఫ్రెండ్ గా మారాడా

ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరోగా జగపతిబాబు మార్కెట్ చాలా బలంగా ఉండేది. గాయం లాంటి సీరియస్ సినిమానే బ్రేక్ ఇచ్చినప్పటికీ శుభలగ్నం దెబ్బకు ఫాన్స్ లెక్కల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆపై మావిచిగురు, ఆయనకు ఇద్దరు, భలే బుల్లోడు, భలే పెళ్ళాం లాంటివి ఫ్యామిలీ ఆడియన్స్ ని మరింత దగ్గరగా చేశాయి. తర్వాత వరస ఫ్లాపులు, సోలోగా తన పేరు మీద సినిమాలు ఆడకపోవడం లాంటి కారణాల వల్ల కొంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కొందరు నిర్మాతలు అడపాదడపా చిత్రాలు తీసినప్పటికీ ఏదీ కూడా కనీస స్థాయిలో ఆడలేదు. ఇక కెరీర్ ముగింపుకొచ్చిందేమో అనుకున్నారందరూ. కానీ జరిగింది వేరు.

ఎప్పుడైతే లెజెండ్ లో బాలకృష్ణకు ధీటుగా క్రూరమైన విలన్ గా మెప్పించాడో అప్పటి నుంచి జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మునుపటి కంటే జోరుగా సాగుతోంది. టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ లో తనదే ఫస్ట్ ప్లేస్. ఇటీవలే ఓ చిన్న బడ్జెట్ సినిమాకు ఆయన్ను ప్రధాన పాత్రగా పెట్టుకుని మూడు కోట్ల బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటే అందులో కోటి జగ్గు భాయ్ కే వెళ్లిందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆ మూవీ డిజాస్టర్ కావడం వేరే సంగతి. లెజెండ్ తర్వాత చాలా బ్లాక్ బస్టర్స్ లో భాగం వహించిన జగపతిబాబుకు అందుకే బోయపాటి శీను అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్.

తాజాగా బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న హ్యాట్రిక్ మూవీలో జగపతి బాబు మరోసారి కీలక పాత్ర చేస్తున్నారట. అయితే విలన్ గా కాదు. హీరో గ్యాంగ్ లో ఒక కీలకమైన క్యారెక్టర్ లో నమ్మిన బంటుగా కనిపిస్తాడని వినికిడి. ఇదే ఓ కీలకమైన మలుపుకు కారణం అవుతుందని తెలిసింది. శ్రీకాంత్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.తనతో పాటు మరికొందరు ప్రతినాయకుల గ్యాంగ్ పెద్దగా ఉంటుందట. సైరాలో చిరంజీవితో పాజిటివ్ క్యారెక్టర్ చేశాక మరోసారి బాలయ్యతో ఛాన్స్ అది కూడా సానుకూలమైన పాత్ర దక్కడం విశేషం. మోనార్క్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మార్చి 11న శివరాత్రి పండగ సందర్భంగా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp