సెల్వ నుంచి సరైన సినిమా వచ్చిందంటున్నారు

By iDream Post Mar. 07, 2021, 01:00 pm IST
సెల్వ నుంచి సరైన సినిమా వచ్చిందంటున్నారు

కల్ట్ క్లాసిక్ డైరెక్టర్ గా తనకంటూ సౌత్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్. 7జి బృందావన్ కాలనీ, ధూల్ పేట తో ఇక్కడా ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సెల్వ ఆ తర్వాత 'యుగానికి ఒక్కడు'తో కార్తీకి పెద్ద బ్రేక్ ఇవ్వడమే కాదు తన టేకింగ్ హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి అందరినీ అబ్బురపరిచాడు. ఆ తర్వాత ఈయన మేజిక్ పనిచేయడం ఆగిపోయింది. అనుష్కతో కోట్ల రూపాయల బడ్జెట్ తో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ ని నమ్ముకుని తీసిన 'వర్ణ' ఎంత డిజాస్టరో మాటల్లో చెప్పడం కష్టం. సరే ఇవన్నీ సహజమే కదాని స్టార్ హీరో సూర్య పిలిచి మరీ 'ఎన్జికె' అవకాశం ఇస్తే ఇది కాస్తా ఇద్దరి కెరీర్లలోనే పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఆ తర్వాత ఈయన సైలెంట్ అయ్యాడు.

అలాంటి సెల్వ అయిదేళ్ల క్రితం 2016లో నెంజమ్ మార్పతిల్లై అనే సినిమా తీశాడు. పవన్ కళ్యాణ్ ఖుషిని డైరెక్ట్ చేసి మహేష్ బాబు స్పైడర్ లో విలన్ గా నటించిన ఎస్జె సూర్య ఇందులో హీరో కం విలన్, నందితా శ్వేతా, రెజీనా హీరోయిన్లు. షూటింగ్ త్వరగానే పూర్తయినా ఆర్ధిక కారణాల వల్ల మూడేళ్లుగా ఇది ల్యాబ్ లోనే ఉంది. గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటిటి రిలీజ్ చేద్దామని ప్రయత్నించారు కానీ ఫైనాన్సియల్ లావాదేవీలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో కథ ముందుకు జరగలేదు. ఈలోగా థియేటర్లు తెరుచుకోవడంతో కష్టపడి నానా ఇబ్బందులు ఎదురుకుని మొన్న శుక్రవారం ఫైనల్ గా రిలీజ్ చేశారు.

కట్ చేస్తే ఇప్పుడీ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో పాటు మంచి రివ్యూస్ వచ్చాయి. అత్యాశపరుడైన రామస్వామి(సూర్య)తక్కువ టైంలో ధనవంతుడిగా ఎదుగుతాడు. దీని వెనుక భార్య(నందిత శ్వేతా)నుంచి వచ్చిన ఆస్తి పాస్తులు ఉంటాయి. అయితే దైవభక్తి మెండుగా ఉండి పెళ్లి సంసారం లాంటివేవీ వద్దనుకున్న పనిమనిషి(రెజీనా)మీద రామస్వామి కన్ను పడుతుంది. అనూహ్య పరిణామాల తర్వాత ఆమె చనిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది కథ. సెల్వ టేకింగ్ ని క్రిటిక్స్ ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు,. ఈ వారం విజేత ఇదేనని ప్రకటిస్తున్నారు. రీమేకో లేదా డబ్బింగో ఏదో ఒకటి తెలుగు ప్రేక్షకులకు ఇది వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp