20 రోజులకే ఇంటికొస్తున్న 'క్రాక్'

By iDream Post Jan. 24, 2021, 11:33 am IST
20 రోజులకే ఇంటికొస్తున్న 'క్రాక్'

సంక్రాంతి సినిమాలన్నింటిలోకి యునానిమస్ విన్నర్ గా నిలిచిన మాస్ మహారాజా రవితేజ క్రాక్ వాటి కన్నా ముందే ప్రేక్షకుల ఇళ్లలోకి నేరుగా రాబోతోంది. అవును ముందు నుంచి ప్రచారం జరిగినట్టే ఈ సినిమాని ఆహా యాప్ 29 నుంచి వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ చేయబోతోంది. ఈ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చేశారు. నిజానికి దీని కలెక్షన్లు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇప్పటికీ వీకెండ్స్ చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. శని ఆదివారాల్లో టికెట్స్ ఈజీగా దొరకడం లేదు. ఇప్పటిదాకా గ్రాస్ కలెక్షన్లు యాభై కోట్లు దాటాయని ట్రేడ్ టాక్. షేర్ పరంగా చూసుకున్నా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటిపోయి పది కోట్ల దాకా లాభం వచ్చింది.

ఈ నేపథ్యంలో ఇంత త్వరగా స్ట్రీమ్ చేయడం గురించి రవితేజ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంత కాలం ఆగొచ్చు కదాని సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలకు నివేదిస్తున్నారు. అయితే ఇది ముందే జరిగిన ఒప్పందం కావడంతో ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి. ఈ కారణంగానే సదరు సంస్థ భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకుని పెట్టుబడులు పెట్టింది. కాబట్టి డేట్ మార్చడానికి ఇష్టపడటం లేదు. క్రాక్ న్యూస్ బయటికి రాగానే ఆ యాప్ కి చందాదారులు భారీగా పెరుగుతారని ఇప్పటికే ఒక అంచనా ఉంది. అది నిజమైనా ఆశ్చర్యం లేదు. దానికయ్యే మొత్తం తక్కువే కాబట్టి.

ఇక మిగిలిన పండగ సినిమాలు కూడా ఇదే బాట పట్టినా ఆశ్చర్యం లేదు. కాకపోతే వాటికి సంబంధించిన డేట్లు ఇంకా బయటికి రాలేదు. మాస్టర్ ఫిబ్రవరి 12న వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఓటిటి వర్గాల్లో దీని గురించి ప్రచారం జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా రాబోతోంది. ఇక రెడ్, అల్లుడు అదుర్స్ హక్కులు సన్ నెక్స్ట్, జెమిని తో ఉన్నాయి కాబట్టి ఆ రెండూ అందులోనే వస్తాయి. బంగారు బుల్లోడు సంగతి ఇంకా తెలియదు,. నిరాశపరిచే టాక్ ఉంది కాబట్టి త్వరగానే రావొచ్చు. ఏదైతేనేం క్రాక్ ని మరీ ఇంత త్వరగా చిన్నితెరమీద చూసుకోవడం అనేది మాత్రం ఎవరూ ఊహించనిది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp