2021 పండగ రేస్ లో రవితేజ 'క్రాక్'

By iDream Post Oct. 25, 2020, 04:49 pm IST
2021 పండగ రేస్ లో రవితేజ 'క్రాక్'

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న క్రాక్ 2021 సంక్రాంతి పండగ బరిలో దిగబోతోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. శృతి హాసన్ తో రవితేజ ఉన్న ఒక సాంగ్ స్టిల్ తో పాటు ఈ విషయాన్ని ప్రకటించారు. థియేటర్లు దేశవ్యాప్తంగా తెరుచుకున్న తరుణంలో దీపావళి లేదా డిసెంబర్ లో క్రాక్ రావొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అంత మెరుగ్గా కనిపించకపోవడంతో నిర్మాతలు జనవరికే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. అంటే ఇంకో రెండున్నర నెలలు రవితేజ అభిమానులు ఎదురు చూడక తప్పదు. ఇప్పటికే దీని మీద మంచి హైప్ ఉంది.

క్రాక్ కు తమన్ సంగీతం సమకూర్చారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఒంగోలు నేపథ్యంగా దీన్నో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. సముతిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ లు విలన్లుగా నటించడం హైప్ ని పెంచుతోంది. విక్రమార్కుడు, పవర్ తరహాలో అవుట్ అండ్ అవుట్ రవితేజ ఎనర్జీని పూర్తిగా వాడుకునే స్థాయిలో దర్శకుడు గోపిచంద్ మలినేని క్రాక్ ని తీర్చిదిద్దినట్టు ఇప్పటికే ఇన్ సైడ్ బలంగా ఉంది. అదే నిజమైతే గత కొంత కాలంగా వరస డిజాస్టర్లతో బాధ పడుతున్న ఫ్యాన్స్ కు పెద్ద ఊరట దక్కుతుంది. ఇప్పటికే బిజినెస్ కు సంబంధించిన డీల్స్ పూర్తయినట్టుగా సమాచారం.

అయితే క్రాక్ ఒంటరిగా బరిలో దిగడం లేదు. రామ్ రెడ్, రానా అరణ్య, నితిన్ రంగ్ దేలు ఇప్పటికే కర్చీఫ్ వేశాయి. అప్పటికంతా థియేటర్లకు ఫుల్ కెపాసిటీ పర్మిషన్లు వచ్చి ఉంటాయి కాబట్టి కలెక్షన్ల పట్ల ట్రేడ్ తో పాటు ప్రొడ్యూసర్లు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. అందులోనూ రవితేజ ఫామ్ లో ఉన్నా లేకపోయినా సరైన సబ్జెక్టు పడితే మళ్ళీ దుమ్ము రేపడం ఖాయం. అందుకే క్రాక్ కు సంబంధించి ఎలాంటి ఓటిటి డీల్స్ వచ్చినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. డిజిటల్ హక్కులు జీ సంస్థకు ఇచ్చినట్టు వినికిడి. క్రాక్ తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp