ప్రభాస్ కోసం కిచ్చ సుదీప్

By iDream Post May. 08, 2021, 05:30 pm IST
ప్రభాస్ కోసం కిచ్చ సుదీప్
డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ త్వరలోనే హైదరాబాద్ లో టేకాఫ్ కానుంది. ఇప్పటిదాకా షూట్ చేసిన ముంబై షెడ్యూల్ కి కొనసాగింపుగా ఇక్కడే గ్రీన్ మ్యాట్ వేసి స్టూడియోలోనే షూట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయని టాక్. నార్త్ లో కరోనా విలయతాండవం చేస్తున్న దృష్ట్యా అనవసరంగా రిస్క్ చేయడం ఇష్టం లేని నిర్మాణ సంస్థ టి సిరీస్ అన్నీ అనుకూలంగా ఉన్న భాగ్యనగరానికే ఓటు వేసింది. కేవలం అయిదు నెలల్లో మొత్తం షూట్ ని పూర్తి చేసేలా దర్శకుడు ఓం రౌత్ పక్కా ప్లానింగ్ తో అంతా సిద్ధం చేసుకుని ఉన్నట్టు సమాచారం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది ఇంకా తెలియాల్సి ఉంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో విభీషణుడి పాత్ర కోసం ఈగ విలన్ కిచ్చ సుదీప్ ని సంప్రదించినట్టు తెలిసింది. తెలుగులో అడపాదడపా నటిస్తున్న సుదీప్ ఆ మధ్య బాహుబలి, సైరాలోనూ క్యామియోలు చేశాడు. ఫుల్ లెన్త్ కాకపోయినా ప్రాధాన్యత దృష్ట్యా మంచి పేరే వచ్చింది. కన్నడలో చాలా బిజీగా ఉండే సుదీప్ ఒప్పుకోవాలే కానీ ఇక్కడ ఆఫర్ల వర్షం కురిపించేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అక్కడ హీరోగా ఉన్న మార్కెట్ వదిలేసి తనైనా సపోర్టింగ్ రోల్స్ కు ఎందుకు వస్తాడు. అది పురుష్ స్పెషల్ మూవీ కాబట్టి అందులోనూ సినిమా మొత్తం ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాధే శ్యామ్ విడుదల తేదీ మారినా ఆది పురుష్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎలాగూ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేశారు కాబట్టి ఆలోగా కరోనా తాలూకు ప్రభావం జీరోకు చేరి ఉంటుంది. ఇంకా చాలా టైం ఉంటుంది కనక ఇప్పడే టెన్షన్ అక్కర్లేదు.దీని కన్నా ముందు సలార్ సమ్మర్ లోనే వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే మాత్రం అవి ఇప్పటికిప్పుడు గెస్ చేయలేము. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఆది పురుష్ సుమారు అయిదు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఎంత ఖర్చు పెట్టినా ప్రభాస్ రేంజ్ కి పెట్టుబడి మొత్తం వెనక్కు రావడం ఇప్పుడేమంత కష్టం కాదు కాబట్టి కూల్ గా ఉండొచ్చు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp