కంబ్యాక్ కోసం మహేష్, చరణ్ హీరోయిన్

By iDream Post May. 16, 2021, 01:30 pm IST
కంబ్యాక్ కోసం మహేష్, చరణ్ హీరోయిన్
మూడేళ్ళ క్రితం వచ్చిన మహేష్ బాబు భరత్ అనే నేనుతో టాలీవుడ్ డెబ్యూ చేసిన కియారా అద్వానీ ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ కొట్టినప్పటికీ రామ్ చరణ్ తో నటించిన వినయ విధేయ రామ డిజాస్టర్ కావడంతో మళ్ళీ ఇటుపక్క కన్నెత్తి చూడలేదు. తర్వాత కూడా చాలా ఆఫర్లు వచ్చాయి కానీ బాలీవుడ్ లోనే స్థిరపడాలన్న ఉద్దేశంతో అక్కడి వెబ్ సిరీస్ లను కూడా చేసింది కానీ తెలుగు సినిమాలకు మాత్రం నో చెబుతూ వచ్చింది. అక్కడ టాప్ వన్ హీరోయిన్ అనిపించుకోకపోయినా ఉన్నంతలో బెటర్ ఆప్షన్స్ లో తనే ముందు వరసలో ఉన్న మాట కూడా వాస్తవం. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ కం బ్యాక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో కియారా అద్వానీని ఫైనల్ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. తనకు ఫస్ట్ మూవీతోనే బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ అడగటంతో నో చెప్పలేకపోయిందని అందులోనూ తారక్ తో కాంబినేషన్ కాబట్టి  ఇక్కడ జెండా పాతేందుకు అవకాశాలు పెరుగుతాయని సానుకూలంగా ఆలోచించినట్టు చెబుతున్నారు. ఇంకా చాలా టైం ఉంది కనక యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడానికైనా సమయం పడుతుంది. అసలు రెగ్యులర్ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలు కాదు. తారక్ శివ ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.

ఆచార్య కోసం కొరటాల శివ ఇంకో రెండు నెలలకు పైగా వర్క్ చేయాల్సి ఉంటుంది. బాలన్స్ ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వ్యవహారాలు తదితరాలు అన్ని పూర్తయ్యేలోపు ఆగస్ట్ వచ్చేస్తుంది. మరోవైపు యంగ్ టైగర్ పరిస్థితి కూడా అంతే. ఆర్ఆర్ఆర్ నుంచి రాజమౌళి ఎప్పుడు విముక్తి కలిగిస్తాడో తెలియదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ వ్యవహారం మాత్రం తెగడం లేదు. జనతా గ్యారేజ్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు ఇప్పటికే ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో తారక్ ఇందులో స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని ఇప్పటికే టాక్ ఉంది. మ్యూజిక్ ఎవరో లీక్ కాలేదు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp