రవితేజ ఆ పొరపాటు చేయరు

By iDream Post May. 16, 2021, 02:59 pm IST
రవితేజ ఆ పొరపాటు చేయరు
గత రెండు రోజులుగా మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఖిలాడీ నేరుగా ఓటిటిలో వస్తుందని ఓ మీడియా వర్గంలో గట్టిగానే ప్రచారం జరిగింది. థియేటర్లు తెరిచే పరిస్థితి దగ్గరలో లేకపోవడంతో నిర్మాతలు ఈ ఆప్షన్ పెట్టుకున్నారని అందులో చెబుతూ వచ్చారు. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ వచ్చేసింది. ఖిలాడీ కేవలం థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత డిజిటల్ సంగతి. ఇందాకే నిర్మాతలు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి కొంత టెన్షన్ పడిన రవితేజ అభిమానులు రిలాక్స్ ఫీలవుతున్నారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈ నెల 28 ఖిలాడీని చూసేవాళ్ళం.

అసలు ఈ పుకారు అర్ధరహితం అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. కొంత పెండింగ్ ఉంది. ఇటలీ నుంచి తిరిగి వచ్చాక బ్యాలన్స్ పార్ట్ ని హైదరాబాద్ తో పాటు కొన్ని అవుట్ డోర్ లొకేషన్లలో ప్లాన్ చేశారు. ఈలోగా వైరస్ ఉపద్రవం వచ్చి పడింది. దీంతో షూట్ కి బ్రేక్ వేశారు. అయినంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు కానీ అది రిలీజ్ కోసం కాదు. వీలైనంత వర్క్ ని తగ్గించుకుంటే టెన్షన్ ఉండదు కాబట్టి. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఖిలాడీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ వచ్చాక అవి రెట్టింపయ్యాయి.

గత ఏడాది క్రాక్ గురించి కూడా సరిగ్గా ఇలాంటి గాసిప్పే చక్కర్లు కొట్టింది. దాదాపు డిజిటల్ లో వచ్చేస్తోందన్నంత హడావిడి చేశారు. కానీ మేకర్స్ కంటెంట్ మీద నమ్మకంతో ఆగి మరీ సంక్రాంతికి రిలీజ్ చేసి బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. సగం సీట్లతోనూ ఇది లాభాలు ఇచ్చిన తీరు బయ్యర్లు మంచి జోష్ ని కలిగించింది. అందుకే ఖిలాడీ విషయంలోనూ ఎలాంటి తొందరపాటు ప్రదర్శించే ఉద్దేశంలో నిర్మాతలు లేరు. థియేటర్లు జూన్ లో తెరుస్తారా లేక జూలై అన్నది ఎవరూ ఆలోచించడం లేదు. ముందు అంతా సద్దుమణగాలి. అప్పటిదాకా ఆగడం తప్ప స్టార్ హీరోల సినిమాలకు వేరే ఆప్షన్ లేదు మరి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp