మే సినిమాలు కూడా వాయిదా

By iDream Post May. 05, 2021, 03:30 pm IST
మే సినిమాలు కూడా వాయిదా
ఏప్రిల్ లో విడుదల కాకుండా వాయిదా పడిన సినిమాల భవితవ్యం ఏంటో ఇంకా తెలియకుండానే మెల్లగా మే మూవీస్ కూడా క్యూ కడుతున్నాయి. ముందు షెడ్యూల్ చేసిన ఖిలాడీ ఈ నెల 28 విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా ఉదృతి కొనసాగుతున్న కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందులోనూ చాలా గ్యాప్ తర్వాత మాస్ మహారాజా సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం కూడా హైప్ ని పెంచుతోంది. కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు.

ఇప్పుడు నెక్స్ట్ క్యూలో బాలయ్య అఖండ ఉంది. ఇది కూడా 28 డేట్ ని రిజర్వ్ చేసి పెట్టుకున్నదే. ఏ కోణంలో చూసినా రిలీజయ్యే ఛాన్స్ లేనట్టే. కాకపోతే టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అంతే. ఇప్పటికే మే నెలను లాక్ చేసుకున్న ఆచార్య, నారప్పలు ఒక్కొక్కటిగా డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు ఖిలాడీ, నెక్స్ట్ అఖండల వంతు. చూస్తుంటే జూన్ లో రావాల్సినవి కూడా ఇదే బాట పట్టక తప్పేలా లేవు. అడవి శేష్ మేజర్ ఆ నెల ముందువరసలో ఉంది. పరిస్థితులు అంతకంతా దారుణంగా ఉండటంతో నిర్మాతలు ఏమి చేయలేని నిస్సహాయతలో ఇలా వాయిదాలు వేయక తప్పడం లేదు.

రాబోయే జూన్ వచ్చాక ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయో వేచి చూడాలి. కోలీవుడ్ తరహాలో ఈసారి సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయడానికి నిర్మాతల మండలి ప్రమేయం తప్పేలా లేదు. అయితే థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో ప్రభుత్వాలు ఎప్పటి నుంచి అనుమతులు ఇస్తాయనేది  సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడ్డాయి. మరోసారి సంక్షోభం మొదలయ్యింది. మరోవైపు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాల లిస్టు అంతకంతా పెరుగుతూ పోతోంది. మొత్తానికి 2020 నుంచి అయితే అతి వృష్టి లేదా అనావృష్టి అనేలా తయారయ్యింది ఎగ్జిబిషన్ రంగం
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp