సందడి చేస్తున్న ధనుష్ సినిమా

By iDream Post Apr. 18, 2021, 02:30 pm IST
సందడి చేస్తున్న ధనుష్ సినిమా
వారం క్రితం ఏప్రిల్ 9న మనకు వకీల్ సాబ్ ఒక్కటే ఆప్షన్ గా మిగిలినట్టే తమిళనాట ధనుష్ నటించిన కొత్త సినిమా కర్ణన్ అక్కడ సందడి చేసింది. లాక్ డౌన్ నిబంధనలు, యాభై శాతం ఆక్యుపెన్సీలను లెక్క చేయకుండా ధైర్యంగా థియేటర్లలో అడుగు పెట్టిన కర్ణన్ కు అక్కడి ఆడియన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. వసూళ్ల పరంగా కూడా కొత్త రికార్డులు నమోదవువుతున్నాయి. ఇది వచ్చే దాకా యావరేజ్ టాక్ తో డీసెంట్ గా రన్ అవుతున్న కార్తీ సుల్తాన్ కర్ణన్ దెబ్బకు బాగా నెమ్మదించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ధనుష్ మూవీ దానికి తగ్గట్టే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాస్ కి నచ్చే అంశాలతో గట్టి హిట్టే కొట్టాడని చెన్నై మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

కథ విషయానికి వస్తే పొడియాంకులం అనే పల్లెటూరిలో అంతా వెనుకబడిన వర్గాల ప్రజలే ఉంటారు. కనీసం బస్సు సౌకర్యం కూడా లేనంత పేదరికంతో మగ్గుతూ ఉంటుంది. పక్కనే ఉన్న మేలూర్ అనే మరో ఊరిలో పెద్ద కులం పెత్తనం వీళ్ళ మీద సాగుతూ గొంతులను అణిచేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. అప్పుడు వస్తాడు కర్ణన్(ధనుష్). ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తన ఊరికి జరుగుతున్న అన్యాయం పట్ల తిరగబడాలని నిర్ణయించుకుంటాడు. మరి లక్ష్యాన్ని పక్కనపెట్టి కర్ణన్ తనవాళ్ళ కోసం ఎలాంటి యుద్ధం చేశాడు, అందులో ఎలా గెలిచాడు అనేదే మిగిలిన స్టోరీ.

ఇది పక్కా అరవ నేటివిటీలో సాగుతుంది. దర్శకుడు మారి సెల్వరాజ్ తీసుకున్న పాయింట్ నిజంగా అక్కడ చాలా చోట్ల ఉన్నదే. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో పాత్రలను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో కొంత ఎక్కువ టైం తీసుకోవడంతో స్లో అనిపించినప్పటికీ తర్వాత తన టేకింగ్ తో మెప్పిస్తాడు. కులాల మధ్య అంతరాలను కాన్సెప్ట్ గా తీసుకుని ఇదే దర్శకుడు రూపొందించిన పరియేరుమ్ పెరుమాళ్ స్థాయిలో కర్ణన్ లేకపోయినప్పటికీ ధనుష్ సినిమా కావడంతో కొన్ని మార్పులు చేశారు. అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు అంత సులభం కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాదు. ఒకవేళ డబ్బింగ్ చేస్తే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కి దక్కించుకోవచ్చు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp