జూనియర్ ఎన్టీఆర్ సూపర్ లైనప్

By iDream Post May. 13, 2021, 11:30 am IST
జూనియర్ ఎన్టీఆర్ సూపర్ లైనప్
2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెండితెర దర్శనం జరగనే లేదు. అదుగో పులి సామెత తరహాలో ఆర్ఆర్ఆర్ వాయిదాల పర్వం కొనసాగిస్తూనే ఉంది. కావాలని చేసింది కాకపోయినా రాజమౌళి సినిమాలకు మురారి లాగా ఏదో శాపం వెంటాడటం కామన్ అయిపోయింది. ఇప్పుడు కరోనా విశ్వరూపం చూస్తుంటే వచ్చే ఏడాది తప్ప 2021లో ఆర్ఆర్ఆర్ చూసే ఛాన్స్ తగ్గిపోతోంది. ఇంత గ్యాప్ ని తారక్ చవిచూడటం ఇదే మొదటిసారి. రాజమౌళితో గతంలో మూడు సినిమాలు చేశాడు కానీ అవన్నీ కమర్షియల్ మూవీస్ కావడంతో అప్పుడు ఈ స్థాయిలో ఆలస్యం జరగలేదు. కానీ ఈసారి మాత్రం తప్పలేదు.

దీని సంగతలా ఉంచితే ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ప్లానింగ్ పిక్చర్ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. ముందు అల్లు అర్జున్ తో ఫిక్స్ చేసుకున్న కొరటాల శివ అది వద్దనుకుని తనతో టయ్యప్ కు ఓకే చెప్పడం జూనియర్ కు చాలా ప్లస్ కాబోతోంది. ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అన్న మాటే లేని కొరటాల వెనకాల ఎందరు స్టార్లు పడుతున్నా జనతా గ్యారేజ్ కాంబో మరోసారి రిపీట్ కావడం కన్నా ఫ్యాన్స్ కు కావాల్సింది ఏముంటుంది. దీని తర్వాత కెజిఎఫ్-సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ ని తారక్ స్వయంగా నిన్న ఒక ఆన్ లైన్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేయడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు.

రాఖీ భాయ్ రేంజ్ ఎలివేషన్లు జూనియర్ కు పడితే ఏ స్థాయిలో గూస్ బంప్స్ వస్తాయో ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఈ లెక్కన చూస్తే కొరటాల శివ సినిమాకు 2022 కేటాయిస్తే 2023 సమ్మర్ లోపు ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేయొచ్చు. అంటే మరో ఏడాదిన్నర తారక్ డైరీ లాక్ అయిపోయింది. ఆ తరువాత ఎవరితో చేస్తారనే ప్రస్తావన ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే కరోనా పుణ్యమాని ఏదీ ప్లానింగ్ ప్రకారం జరిగే సూచనలు కనిపించడం లేదు. ఎంత పక్కాగా ఉన్నా సరే అడ్డంకులు తప్పడం లేదు. సలార్ లాగే తక్కువ టైంలోనే తారక్ తో యాక్షన్ ఎంటర్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp