ఊహించని కాంబో సెట్టవుతోందా

By iDream Post Jul. 28, 2021, 04:20 pm IST
ఊహించని కాంబో సెట్టవుతోందా

ముందే ప్లాన్ చేసుకున్నారో లేక అనుకోకుండా జరిగిపోతున్నాయో తెలియదు కానీ ఒక్కొక్కరుగా తమిళ హీరోలు మన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లను చాలా తెలివిగా లాక్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా ట్యాగ్ తో అరవ మార్కెట్ నే ప్రధాన టార్గెట్ గా చేసుకుని చక్కగా ప్రాజెక్టులు సెట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ధనుష్-శేఖర్ కమ్ముల ప్రాజెక్టు ఫిక్స్ అయిపోయింది. విజయ్-వంశీ పైడిపల్లి ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా శివ కార్తికేయన్ ఇందులో జాయిన్ కాబోతున్నాడు. చెన్నై టాక్ ప్రకారం జాతిరత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వంలో ఆసియన్ ఫిలింస్ బ్యానర్ పై సినిమా దాదాపు ఖాయమే అంటున్నారు.

Also Read: వచ్చే నెల కూడా చిన్న సందడే ?

ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న లాక్ అవ్వొచ్చని వినికిడి. కార్తీతో సుల్తాన్ రూపంలో డెబ్యూ చేశాక ఇది కనక ఓకే అయితే కోలీవుడ్ లో రెండో మూవీ అవుతుంది. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నట్టుగా సమాచారం. రష్మిక ప్రస్తుతం నాలుగు సినిమాలతో హైదరాబాద్ ముంబైల మధ్య అప్ అండ్ డౌన్ చేస్తోంది. పుష్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు ఒకవైపు, హిందీలో మిషన్ మజ్ను, అమితాబ్ తో చేస్తున్న గుడ్ బై మరోవైపు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఇవయ్యాక ఏవి కమిట్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు. శివ కార్తికేయన్ తో జట్టు కట్టడం గురించి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి.

Also Read: ఆ ఇద్దరికీ భలే లక్కీ ఛాన్స్

నిజానికి జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత కెవి అనుదీప్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. టాప్ ప్రొడక్షన్ హౌసులు వెంటపడినా కూడా తొందరపడకుండా ఆగుతూ వచ్చాడు. నిజానికి జాతిరత్నాలుకు సీక్వెల్ అన్నారు కానీ ఆ తర్వాత దాని ఊసు లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్రెష్ స్క్రిప్ట్ తో అనుదీప్ వేరే చిత్రం చేయబోతున్నాడన్న క్లారిటీ అయితే వచ్చింది. మన హీరోలేమో ఎక్కువ కాలం ఒకే ప్రాజెక్టుకు సమయం ఖర్చు పెడుతుండటంతో వేచి చూస్తూ ఖాళీగా ఉండలేని దర్శకులు తమిళ స్టార్ల వైపు చూస్తున్నారు. అంతే మరి. బాష ఏదైనా ప్రూవ్ చేసుకోవడం సక్సెస్ కొట్టడం ముఖ్యం. అందుకే అటువైపు వెళ్ళక తప్పడం లేదు

Also Read: రాజమౌళి కీరవాణిల మ్యూజిక్ స్కెచ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp