మిల్కీ బ్యూటీకి ఆఫర్ల వెల్లువ

By iDream Post Jun. 20, 2021, 03:30 pm IST
మిల్కీ బ్యూటీకి ఆఫర్ల వెల్లువ

పదేళ్లకు పైగా కెరీర్ ని ఎంజాయ్ చేసాక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్లు మీడియం రేంజ్ హీరోలతోనూ జట్టు కడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. హీరోయిన్ గా ఉన్న బ్రాండ్ ఇమేజ్ వీటికి బాగా ఉపయోగపడుతోంది. సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం, వెంకటేష్ తో ఎఫ్3, గోపి చంద్ సీటిమార్, నితిన్ మాస్ట్రోలతో 2021లోనే రాబోతున్న తమన్నా బోలే చుడియా అనే బాలీవుడ్ మూవీ కూడా చేసింది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతున్నాయి. తమన్నాతో సమాంతరంగా కెరీర్ ఉన్న సీనియర్లు ఎవరూ ఇంత బిజీగా లేరన్న మాట వాస్తవం. ఇక్కడితో గ్రాఫ్ అయిపోలేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం తమన్నా మరో జాక్ పాట్ లాంటి ఆఫర్ కొట్టిందని బెంగుళూరు టాక్. కెజిఎఫ్ తర్వాత హీరో యష్ నటించబోయే పాన్ ఇండియా సినిమాలో తననే తీసుకోబోతున్నట్టు తెలిసింది. కన్నడ దర్శకుడు నర్తన్ దీన్ని రూపొందించబోతున్నారు. ఇతను ప్రశాంత్ నీల్ శిష్యుడే. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. కెజిఎఫ్ సౌత్ వెర్షన్స్ లో తమన్నా స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ పాట బాగానే క్లిక్ అయ్యింది. అప్పుడే నెక్స్ట్ మూవీకి సంబంధించి ప్లానింగ్ జరిగిందట. ఎలా చూసుకున్నా యష్ పక్కన చేయడం అంటే తమన్నాకు కన్నడలో కూడా అవకాశాలు తెచ్చి పెడుతుంది.

దీనికి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ ఇంకా రావాల్సి ఉంది. కెజిఎఫ్ 2 ప్రమోషన్ల మీద దృష్టి పెడుతున్న యష్ కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. అంచనాలకు తగ్గట్టే కథ రూపొందిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి. కెజిఎఫ్ 2 రిలీజ్ విషయంలో ఇంకా స్పష్టత లేదు. ముందు చెప్పిన జులై డేట్ వాయిదా వేశారు. దసరా లేదా దీపావళి రెండు ఆప్షన్లు మేకర్స్ ముందున్నాయి. ఇతర భారీ చిత్రాల రిలీజ్ డేట్లు పరిగణనలోకి తీసుకుని అప్పుడు డిసైడ్ చేయబోతున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల ట్రైలర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp