పవన్ కళ్యాణ్ జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ

By iDream Post Nov. 23, 2020, 01:20 pm IST
పవన్ కళ్యాణ్ జోడిగా ఇస్మార్ట్ బ్యూటీ

అజ్ఞాతవాసి తర్వాత రెండేళ్ల బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఏకంగా అయిదారు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది ముందు పూర్తి చేస్తారో ఏది ముందు విడుదలవుతుందో క్లారిటీ మిస్సై అభిమానులు అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప దాదాపు పూర్తయినట్టే కాబట్టి శృతి హాసన్ రాగానే అది కూడా ఫినిష్ చేస్తారు. ఇటీవల జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ దానికి కొంచెం బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది. సంక్రాంతి 2021కి విడుదల చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు లేరని ఇన్ సైడ్ టాక్. దీంతో వేసవి దాకా పవన్ ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు.

దీని తర్వాత పవన్ అయ్యప్పనుం కోషియం రీమేక్ లో పాల్గొంటారని ఇప్పటికే న్యూస్ ఉంది కానీ ఆల్రెడీ స్టార్ అయిపోయిన క్రిష్ ప్రాజెక్ట్ కూడా సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. కాకపోతే ముందుగా పూర్తయ్యేది మాత్రం మొదటిదే. ఇక క్రిష్ దర్శకత్వం చేస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ మెల్లగా వీడుతోందని తెలిసింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో అందరి దృష్టిలో పడిన నిధి అగర్వాల్ నే ఫైనల్ చేయబోతున్నట్టు వినికిడి. లాక్ డౌన్ కు ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పటికి రూట్ క్లియర్ అయ్యిందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన త్వరలో చేయొచ్చు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో పవన్ యుద్ధవీరుడు యోధుడిగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రెండు దశాబ్దాల పవన్ కెరీర్ లో ఏనాడూ చేయని హిస్టారికల్ పాత్ర ఇందులో ఉంటుంది. నిధి కాకుండా బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాన్డెజ్ తో పాటు అర్జున్ రామ్ పాల్ ఇతర కీలక తారాగణం. ఇంకొంత క్యాస్టింగ్ ఫైనల్ కావాల్సి ఉంది. విడుదల గురించి ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. క్రిష్ వేగంగా తీస్తాడని పేరున్నా కరోనా నిబంధనల వల్ల ఈసారి అంత ఫాస్ట్ గా సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే 2022లోనే ఇది విడుదలవుతుంది. వచ్చే ఏడాది వకీల్ సాబ్, బిల్లారంగా(అయ్యప్పనుం రీమేక్)లు మాత్రం పక్కాగా వస్తాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp