తమన్నా పాట కోసం ఇంత ఖర్చా

By iDream Post Jul. 26, 2021, 03:30 pm IST
తమన్నా పాట కోసం ఇంత ఖర్చా

వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న గని షూటింగ్ చివరి స్టేజికి వచ్చేసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర, రమ్యకృష్ణ లాంటి సీనియర్ క్యాస్టింగ్ ఇందులో భాగం పంచుకోవడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నాతో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కేవలం 5 రోజుల షూటింగ్ కోసం డెబ్భై ఐదు లక్షల పారితోషికం ఆఫర్ చేశారనే న్యూస్ గుప్పుమంటోంది. ఇది నిజమో కాదో కానీ తమన్నా అంత డిమాండ్ చేసినా ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది

అసలు సీరియస్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న గనికి ఈ మసాలా కోటింగ్ ఎందుకనే అనుమానం కలగడం సహజం. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొత్త వెర్షన్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రూపొందుతున్న లైగర్ కూడా ఇదే తరహా కథాంశంతో రూపొందుతోంది. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా చాలా గట్టిగా ఉందట. దాని పోటీని తట్టుకోవాలంటే ఐటెం సాంగ్ అవసరం ఉందనిపించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో రిలీజయ్యాక కానీ క్లారిటీ రాదు. ముందు ఏది వస్తుందో కూడా చెప్పలేం

ఇటీవలి కాలంలో బాక్సింగ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. తూఫాన్, సార్పట్ట పరంపర వారం రోజుల వ్యవధిలో ప్రైమ్ లో పలకరించాయి. పదే పదే ఒకే ఆట మీద సినిమాలు వస్తే ప్రేక్షకులు రొటీన్ గా ఫీలయ్యే ప్రమాదం ఉంది. గని స్టోరీ పరంగా ఎంత వైవిధ్యంగా ఉన్నా కూడా మెయిన్ పాయింట్, క్లైమాక్స్ లాంటి విషయాల్లో పైన చెప్పిన వాటితో కొంచెం పోలిక కలిగి ఉంటుంది. అందుకే మాస్ ఆడియన్స్ ని సంతృప్తి పరచాలంటే మాత్రం ఇలాంటి కోటింగ్ అవసరమే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ గురించి తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు. పోటీ సినిమాల డేట్లను పరిగణనలోకి తీసుకుని అప్పుడు డిసైడ్ కాబోతున్నారు

Also Read: సంక్రాంతి లక్ష్యంగా పవర్ స్టార్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp