పండగ పోటీకి ప్రభాస్ సై ?

By iDream Post Jul. 29, 2021, 11:20 am IST
పండగ పోటీకి ప్రభాస్ సై ?

మొత్తానికి హమ్మయ్య అనుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్. మరి రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి కావడం కంటే శుభవార్త వాళ్లకు ఇంకేముంటుంది. కరోనాతో పాటు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ గ్రాండియర్ లవ్ స్టోరీ ఎట్టకేలకు ఫైనల్ కాపీ ముస్తాబు చేసుకోవడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేసింది. ఇంకో మూడు రోజుల్లో ఒక కీలక అప్ డేట్ ఉంటుందని దర్శకుడు రాధా కృష్ణ ట్వీట్ చేయడంతో అది రిలీజ్ డేట్ గురించేనని మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. కానీ టీజర్ లేదా ట్రైలర్ తాలూకు విడుదల సమాచారం ఉండేందుకే ఎక్కువ అవకాశం ఉంది. అయితే రిలీజ్ గురించి మాత్రం ఒక షాకింగ్ ట్విస్ట్ ఉందట.

దేశవ్యాప్తంగా కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో పాటు నార్త్ లో చాలా రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు ఓపెన్ చేయని కారణంగా రాధే శ్యామ్ ని ఈ ఏడాదికి బదులు 2022 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారట. అప్పటికే రేస్ లో పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్, సర్కారు వారి పాట, ఎఫ్3, బీస్ట్ లు ఉన్నాయి. ఒకవేళ రాధే శ్యామ్ కూడా తోడైతే ఓపెనింగ్స్ పరంగా అందరూ చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అందుకే సంక్రాంతి కన్నా ముందు లేదా తర్వాత వస్తేనే బెటర్. ఇప్పటిదాకా ఏ నిర్మాతా ఫలానా డేట్ కి వస్తున్నామని చెప్పలేదు. కేవలం కమింగ్ ఆన్ సంక్రాంతి అని చెబుతున్నారు. సో ఎవరిదీ అఫీషియల్ గా తీసుకోవడానికి లేదు.

రాధే శ్యామ్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సోలో రిలీజ్ దక్కితేనే బెటర్. ఎలాగూ పుష్ప డిసెంబర్ లో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆ స్లాట్ ని కెజిఎఫ్ 2తో పాటు రాధే శ్యామ్ షేర్ చేసుకుంటే బెటర్. ఒకవేళ సాధ్యం కాదు అనుకుంటే జనవరి తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అసలు నిర్మాతల మనసులో ఏముందో అర్థం చేసుకోవడం థ్రిల్లర్ సినిమా కన్నా ఎక్కువ పజిల్ లా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఒకవేళ ఆగస్ట్ 2న వచ్చే ప్రకటన రిలీజ్ ది అయితే మాత్రం ఇతర నిర్మాతలు వెంటనే అలెర్ట్ అవ్వాల్సి వస్తుంది

Also Read: సన్ అఫ్ పూరి ఎప్పుడు వస్తున్నాడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp