లూసిఫర్ మార్పులు రిస్కా సేఫా

By iDream Post Jan. 22, 2021, 12:04 pm IST
లూసిఫర్ మార్పులు రిస్కా సేఫా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందబోయే లూసిఫర్ రీమేక్ మొన్న లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరగనుంది. ఆచార్య ఇంకా బ్యాలన్స్ ఉంది కాబట్టి అది ఫినిష్ అయ్యాక దీని వేగం పెంచబోతున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులన్నీ వేగంగా చక్కబెట్టేశారు. క్యాస్టింగ్ కూడా జరిగిపోతోంది కానీ ఎక్కువ డీటెయిల్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇప్పటిదాకా సత్యదేవ్, నయనతార పేర్లు మాత్రమే గట్టిగా వినిపిస్తున్నాయి. అవి కూడా ఏ పాత్రలు అనే విషయంలో క్లారిటీ లేదు.

ఇక్కడ మరో పరిశీలించాల్సిన అంశం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. లూసిఫర్ ని మక్కికి మక్కి తీస్తే ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం కొంచెం కష్టం. అందులో హీరోయిన్ ఉండదు. ఫైట్లు కూడా ఓ మూడు ఉంటాయి అంతే. హీరో పాత్రకు సంబంధించిన నేపథ్యం కొంత సున్నితంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఓ యంగ్ క్యారెక్టర్ ఎక్కువ హై లైట్ అవుతుంది. కాసేపు అసలు హీరో కాకుండా ఈ పాత్ర చుట్టే అరగంట పైగా స్టోరీ రన్ అవుతుంది. కొంత గ్యాప్ తో మళ్ళీ కిక్కిచ్చే సీన్స్ తో మోహన్ లాల్ రీ ఎంట్రీ ఉంటుంది. ఇవన్నీ అక్కడ బాగానే రిసీవ్ చేసుకున్నారు కానీ ఇక్కడి జనం అభిరుచులు వేరు కదా.

అందుకే లూసిఫర్ రీమేకులకు సంబంధించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయట. సాధారణంగా ఎలాంటి చేంజ్ చేయడానికి ఒప్పుకోని మోహన్ రాజా చిరు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోక తప్పని పరిస్థితి. అందుకే దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు చేసి సిద్ధం చేశారట. నేనే రాజు నేనే మంత్రితో పొలిటికల్ డైలాగుల విషయంలో బాగా పేరు తెచ్చుకున్న లక్ష్మి భూపాలని దీని కోసమే ప్రత్యేకంగా ఎంచుకున్నారు. సత్యానంద్ సహకారం కూడా ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టైటిల్ కూడా బైరెడ్డి అని ప్రచారం జరిగింది కానీ ఇంకా క్లారిటీ లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp