ఇంతకీ ఈ సినిమాలో ఇత‌ను హీరోనా? విలనా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

By Press Note 15-11-2019 10:54 AM
ఇంతకీ ఈ సినిమాలో ఇత‌ను హీరోనా? విలనా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!
ప్రపంచ వ్యాప్తంగా ఈ నవంబర్ 15న విడుదల అవుతున్న సినిమా విశాల్ అండ్ తమన్నా నటించిన యాక్ష‌న్". ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా కాసేప‌టి క్రితం విడుదల అయిన ఈ సినిమా సరికొత్త పోస్టర్ సిని ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ సినిమా టీం విశాల్ ది ఒక లుక్ విడుదల చేశారు. ఆ లుక్ లో విశాల్ ఒక తీవ్రవాది గెటప్ లో ఉండి, చేతికి సంకెళ్లు చుట్టూ జవాన్లు పట్టుకొని విశాల్ ను తీసుకొస్తున్నారు. ఆ లుక్ ని చూసిన నెటిజన్లు ఇంతకి ఈ సినిమాలో విశాల్ హీరోనా, విలనా రెండూ కాకా డబల్ రోల్ ఏమైనా ప్లే చేస్తున్నడా అనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కానీ విశాల్ నటించిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసేద్దామా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో మన ముందుకు రానున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి మరి. విశాల్, తమన్నా, ఐశ్వర్య లక్ష్మీ, తదితరులు నటించిన ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు. శ్రీ కార్తికేయ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్‌ ఆడెపు (వరంగల్ శ్రీను) నిర్మిస్తున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News