బిగ్ బాస్ 4 లో నాకొక చిన్న అనుమానం - TNR

By TNR Sep. 12, 2020, 08:07 pm IST
బిగ్ బాస్ 4 లో నాకొక చిన్న అనుమానం - TNR
బిగ్ బాస్ లో జరిగేదంతా స్క్రిప్టెడ్ కాదు అంటారు కదా...?
నాకు కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ చెప్పారు స్క్రిప్టెడ్ కాదని…
బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళే పార్టిసిపెంట్స్ ముందే ఎవరూ ఎవరికీ రివీల్ కారూ అంటుంటారు కదా...?
కొంతమందేమో అవుతారంటారు..కొంతమంది అవ్వరంటారూ..
చూసే ప్రేక్షకులకు మాత్రం అలా ముందుగానే రివీల్ అవ్వరు అనేలా ప్రొజెక్ట్ చేస్తుంటారు బిగ్ బాస్ టీం.
మనం ప్రాక్టికల్ గ తెలుసుకుంటే తప్ప అది కంఫర్మ్ చేసుకోలేం..
కానీ మొదటిరోజు జరిగిన ఓపెనింగ్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో ఒక సన్నివేశం ఇది స్క్రిప్టెడ్ అని,గెస్టులు ముందుగానే ఒకరికొకరు రివీల్ అవుతారు అనడానికి బలం చేకూర్చే విధంగా ఉంది.
అదేంటంటే ....
"లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్" మూవీ ఫేమ్ అభిజీత్ ఎపిసోడ్...
అభిజీత్ స్టేజ్ మీద నాగార్జున దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అభిజిత్ కి ఒక పజిల్ ఇచ్చారు.
అదేంటంటే...స్క్రీన్ మీద కాజల్,పూజా హెగ్డే,తమన్నా ఫోటోలు చూపించి ఈ ముగ్గురిలో ఎవరితో డేట్ చెయ్యాలని ఉంది,ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఉంది,ఎవరిని ముద్దు పెట్టుకోవాలని ఉంది అని..
దానికి అభిజిత్ తనకు అనుకూలంగా ఏవో సమాధానాలు చెప్పాడు..
అంత వరకు ఓకె...
నెక్స్ట్ ..స్క్రీన్ మీద ఇంకొక ముగ్గురు అమ్మాయిల ఫోటోలు చూపించి అదే ప్రశ్న వేస్తాడు నాగార్జున.
ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకరు మోనాల్,రెండు రాశీఖన్నా,మూడు నబా నటేష్..
ఆ ప్రశ్నకి సమాధానంగా మోనాల్ ని పెళ్ళి చేసుకుంటాను,రాశీఖన్నా తో డేట్ కి వెళ్తాను,నభా నటేష్ కి ముద్దు పెడతాను అని చెప్పాడు అభిజిత్..
అంత వరకు బాగుంది...
కానీ మోనాల్ జస్ట్ అంతకు కొద్ది నిమిషాల ముందే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంటర్ అయింది.
ఆ విషయం అభిజిత్ కి తెలియదు..
అలా...తెలియదు అనే మనం అనుకుందాం.
వార్నీ..భలే ఇరికించాడురా అభిజిత్ ని నాగార్జున అని ఆడియన్స్ అనుకుంటారు.
అభిజిత్ కి ఆ విషయం తెలియదు అది స్క్రిప్టెడ్ కాదు అనుకుంటే గనక చాలా కాజువల్ గా
తనకు మోనాల్ హౌజ్ లో ఉందన్న విషయం తెలీదు అన్నట్టుగానే సమాధానం చెప్పాలి.
అలాగే చెప్పాడు కూడా..
అంత వరకు బాగానే ఉంది..
కానీ…ఒకవేళ స్క్రిప్టెడ్ కాకపోతే గనక & మోనాల్ బిగ్ బాస్ పార్టిసిపెంట్ అని అభిజిత్ కి ముందే తెలియకపోతే గనక హౌజ్ లోకి ఎంటర్ అవగానే మోనాల్ ని చూసిన అభిజిత్ చాలా సర్ ప్రైజ్ అవ్వాలి..
షాక్ అవ్వాలి..
అమ్మ నాగార్జున గారూ ...ఇంత ఫిట్టింగ్ పెట్టారా అని తన expression లో తెలియాలి.
అక్కడ అదేమీ జరక్కుండా చాలా కాజువల్ గా హౌజ్ లొని పార్టిసిపెంట్స్ అందరికీ ఇచ్చినట్టే మోనాల్ కి కూడా షేక్ హాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంటాడు.
అది ఎలా సాధ్యం?
ఒకవేళ బిగ్ బాస్ లో ఒక కామన్ మ్యాన్ ఎంటర్ అయి ఆ పరిస్థితి ని ఎదుర్కున్నా అలా షాకింగ్ గానే రియాక్ట్ అవుతాడు.
పోనీ ఒకవేళ స్క్రిప్టెడ్ అనుకుంటే గనక కనీసం అభిజీత్ అక్కడ షాక్ అయినట్టు యాక్టింగ్ చెయ్యాలి.
లేదూ… "ఇందులో కొత్తేo ఉందీ..ఇవన్నీ బిగ్ బాస్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసిన విషయాలే కదా ...ఇదంతా స్క్రిప్టెడే,ఇందులో డ్రామా ఉంటుంది… ఈ విషయాలు అందరికీ తెలిసినవే కదా"అనుకుంటే గనక కనీసం ప్రేక్షకులకు డ్రామాని క్రియేట్ చెయ్యడానికైనా అభిజిత్ యాక్టింగ్ చేసి ఆ సన్నివేశాన్ని పండించి ఉండాల్సింది కదా..
పోనీ...ఎడిటింగ్ లో ఆ బిట్ వరకు కట్ అయిందనుకునే చాన్స్ లేదు..
ఎందుకంటే ..అలాంటి రియల్ ఎక్స్ప్రెషన్సే కదా బిగ్ బాస్ లో ఆడియన్స్ కోరుకునేది...
అది ఎలా కట్ చేస్తారు..?
అంటే అది స్క్రిప్టెడ్ అయి ఉండాలి..
పార్టిసిపెంట్స్ ఒకరికొకరు వస్తున్నట్టు ముందే తెలిసి ఉండాలి..
అది స్క్రిప్టెడ్ అయినా కూడా ఆ విషయం మర్చిపోయి అభిజిత్ అక్కడ యాక్టింగ్ చెయ్యకుండా మామూలుగా బిహేవ్ చేసి ఉండి ఉండాలి.
అక్కడ నాగార్జున క్రియేట్ చేసిన హైప్ కీ,హౌజ్ లోపల జరిగినదానికి సింక్ కుదరలేదు అన్నదే నా పాయింట్.
ఇక ముందయినా ముందు ముందు ఎపిసోడ్స్ లో అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో బిగ్ బాస్ టీం జాగ్రత్తపడితే ఇది స్క్రిప్టెడ్ కాదూ అనే విషయం ఆడియన్స్ నమ్ముతారని...ఆ విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే సదుద్దేశం తోనే ఈ పోస్ట్..
( ఒకసారి హాట్ స్టార్ కి వెళ్లి బిగ్ బాస్ 4 మొదటి ఇంట్రడక్షన్ ఎపిసోడ్ లో నాగార్జునతో అభిజీత్ స్టేజ్ మీద మాట్లాడిన దగ్గర నుండి తను హౌజ్ లోపలికి వెళ్లే దాకా ఉండే ఆ 10నిమిషాల వీడియోని మీరు మల్లీ ఒకసారి చూస్తే అర్థమయిపోతుంది మీకు.)
.............
ఈ పోస్ట్ బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ రోజే పెడదామనుకున్నా..
కానీ కంటిన్యూగా నాకు షూటింగ్స్ నడుస్తూ బిజీగా ఉండటం వలన రాసే టైం దొరకలేదు.
ఈరోజు ఫ్రీ టైమ్ దొరికి ఇలా పోస్ట్ చేస్తున్నాను.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp