ఎనర్జిటిక్ స్టార్ మూవీకి ఇబ్బందులు

By iDream Post Jun. 26, 2021, 06:25 pm IST
ఎనర్జిటిక్ స్టార్ మూవీకి ఇబ్బందులు

ఈ ఏడాది ప్రారంభంలో రెడ్ రూపంలో డీసెంట్ హిట్ దక్కించుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ నెక్స్ట్ తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ ని కూడా లాక్ చేశారు. ఆ విషయాన్నే నిన్న రామ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు కూడా. అయితే ఇంతలోనే ఓ చికొచ్చి పడింది. కోలీవుడ్ ప్రముఖ నిర్మాత హీరో సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా హైదరాబాద్ కు వచ్చి ఇక్కడి ఫిలిం ఛాంబర్ లో లింగుస్వామి మీద ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పాత లావాదేవీలు ఇంకా సెటిల్ కావాలని అప్పటిదాకా ఇది ఆపేయమని ఓ పిటీషన్ లాంటి లెటర్ ఇచ్చారట.

ఈ కారణంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీని మీద చర్య తీసుకుంటుందో లేదో చెప్పలేం కానీ వ్యవహారం చూస్తే అప్పుడెప్పుడో వచ్చిన సూర్య సినిమా సికందర్ కు సంబంధించినదని చెన్నై మీడియా టాక్. ఇది లింగుస్వామి డైరెక్షన్ లోనే రూపొందింది. భారీ అంచనాలతో కోట్లాది రూపాయల బడ్జెట్ తో జ్ఞానవేల్ రాజానే నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఇది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. తెలుగులోనూ ఆడలేదు. ఆ టైంలోనే తనకు ఆర్థికంగా చాలా నష్టం కలిగించారంటూ రాజా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారట. ఆ తర్వాత లింగుస్వామి తీసింది పందెం కోడి 2 మాత్రమే. దాని ప్రొడ్యూసర్ విశాల్. వీటి మధ్య లింగుస్వామి నాలుగేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. జ్ఞానవేల్ రాజాతో వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సరే ఇదంతా ఎలా ఉన్నా కోలీవుడ్ లో వచ్చిన సమస్యకు టాలీవుడ్ లో స్పందిస్తారా అంటే అనుమానమే. అసలే ఇక్కడ మా ఎన్నికల వాతావరణంతో ఇండస్ట్రీ వేడిగా ఉంది. ఈ సమయంలో జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి. ఇంతకీ లింగుస్వామి వెర్షన్ ఈ విషయంలో ఇంకా బయటికి రాలేదు. రామ్ మాత్రం షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. విడుదల ఈ ఏడాది దాదాపు ఛాన్స్ లేనట్టే. ఇస్మార్ట్ శంకర్ మించిన సక్సెస్ కొట్టాలని ఎదురు చూస్తున్న రామ్ కోసం లింగుస్వామి పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ సిద్ధం చేసినట్టుగా సమాచారం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp