పెద్దల్ని అరెస్ట్ చేసే పిల్లల అల్లరి

By iDream Post Feb. 27, 2021, 11:57 am IST
పెద్దల్ని అరెస్ట్ చేసే పిల్లల అల్లరి

ఏడాదిన్నర క్రితం ఆరెక్స్ 100 కార్తికేయతో 90 ఎంఎల్ ద్వారా పరిచయమైన దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర కొత్త సినిమా హౌస్ అరెస్ట్ వచ్చే నెల విడుదల కాబోతోంది. నిన్న ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈవెంట్ లో టీజర్ ని లాంచ్ చేశారు. అయిదుగురు చిన్నపిల్లలతో పాటు శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా యువరాజ్ ఛాయాగ్రహణం అందించారు. గత ఏడాది లాక్ డౌన్ టైం ఆగస్ట్ లో పనులు ప్రారంభించిన హౌస్ అరెస్ట్ ని అతి తక్కువ టైంలో రీజనబుల్ బడ్జెట్ లో వేగంగా పూర్తి చేయడం విశేషం. ఇక టీజర్ సంగతేంటో చూద్దాం.

ఉన్నట్టుండి సిటీలో అయిదుగురు దొంగల గ్యాంగ్ తప్పిపపోతుంది. వాళ్ళ భార్యలు పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తారు. షాక్ తిన్న పోలీసులు వేట మొదలుపెడతారు. అయితే పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళను వేరే దేశాలకు అమ్మే ఆలోచనలో ఉన్న ఆ ముఠా అనుకోకుండా ఓ రాత్రి పెద్దలు లేని ఇంట్లోకి చొరబడతారు. అక్కడ ఏకంగా అయిదుగురు పిల్లలు ఉండటంతో పంట పడిందనుకుని వాళ్ళను ఎత్తుకెళ్లే స్కెచ్ వేస్తారు. అయితే రివర్స్ ఆ పిల్లలే వీళ్ళను అరెస్ట్ చేసి ఆడుకోవడం మొదలుపెడతారు. దీంతో కాళరాత్రిగా మారిన ఆ వలయం నుంచి ఆ దొంగలు బయట పడ్డారా లేదా అనేదే అసలు కథగా కనిపిస్తోంది.

టీజర్ ని గమనిస్తే ఇది పిల్లలను పెద్దలను కలిపి టార్గెట్ చేసిన ఎంటర్ టైనర్ గా అర్థమవుతోంది. విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్రత్యేకంగా హీరో హీరోయిన్ అంటూ ఎవరూ లేకుండా కేవలం కిడ్స్ ని ఆధారంగా చేసుకుని వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పిల్లలు బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఈ మధ్య నీలి నీలి ఆకాశం పాటతో సెన్సేషన్ సృష్టించిన అనూప్ రూబెన్స్ సంగీతం దీనికి మరో ఆకర్షణగా నిలవబోతోంది. వచ్చే నెల రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్న హౌస్ అరెస్ట్ ఇటు పిల్లలు అటు హాస్య ప్రియులను ఒకేసారి టార్గెట్ చేసిరాబోతోంది . ఇంకా విడుదల తేదీని ఖరారు చేయాల్సి ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp