హిర్కానీ-బిడ్డల ఆకలి తీర్చటానికి శివాజీ కోటను దాటినా తల్లి కథ

By Vivek Segileti Feb. 02, 2020, 10:40 am IST
హిర్కానీ-బిడ్డల ఆకలి తీర్చటానికి శివాజీ కోటను దాటినా తల్లి కథ

ఛత్రపతి శివాజీ కాలంలో ఒకరోజు కోట ద్వారాలు మూసేస్తే ఒక తల్లి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొండ దిగి మరీ తన బిడ్డ ఆకలి తీర్చిందని చదివి చాలా ఆశ్చర్యమేసింది. సృష్టి మొత్తంలో తల్లి ప్రేమ చాలా గొప్పదని తెలుసుగానీ మరీ కన్న బిడ్డ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచెయ్యని తెగువ ఉంటుందని ఆమెని చూస్తే అర్థమయ్యింది.

అలాంటి ఒక థీర వనిత ,ఒక అమాయకమైన బిడ్డ తల్లి కథ ఆధారంగా తీసిన సినిమా హిర్కానీ. సినిమా చాలా బాగుంది,ఎక్కడే గాని మనం చూసేది ఒక సినిమా అనిపించదు. అంత బాగా తీశారు. భర్త రాజోద్యోగి. భార్యని ఎంత ప్రేమిస్తాడో తన రాజునీ రాజ్యాన్నీ అంతే ప్రేమిస్తాడు. పక్కనున్న అడవుల్లోంచి వచ్చి ఊర్లో దాడి చేసే తోడేలును చూసినా ఆమె వణికిపోతుంటుంది. ఇలా ఉండకూడదని ఎంత ధైర్యం నూరి పోసినా ఆమె భయం ఆమెదే. జీవితంలో ఒక్కసారైనా రాజు గారిని చూడాలని భర్తను పోరుతూ ఉంటుంది. బిడ్డ పుడతాడు. రోజూ కోటకు వెళ్లి పాలు పోసి రావడం, పిల్లోన్ని ముసలి అత్తను చూసుకోవడమే ఆమె పని. నేనొక ముఖ్యమైన పని మీద బయటికెళ్తున్నాను తిరిగి పున్నమి నాటికి వస్తాననీ, తోడేలు వస్తే ఎలా ఎదుర్కోవాలో జాగ్రత్తలన్నీ చెప్పి భర్త వెళ్లిపోతాడు.

పున్నమి నాడు కోటలో జరిగాల్సిన ఒక ఉత్సవం కోసం పాలు కావాలని అందరికీ చెప్తారు. తను పోసే పాలు రాజు గారి వంటశాలకు వెళ్తాయా అనే సంశయంతో కూడిన ఆనందంతో లోపలికి వెళ్తుంది. ఆమె బయటికొద్దామనుకునే లోపు కోట ద్వారాలు మూసేస్తారు. ద్వార పాలకులను కాళ్లా వేళ్లా పడి వేడుకుంటుంది. రాజాజ్ఞ ప్రకారం సాయంత్రం ఒక్కసారి తలుపులు మూస్తే మళ్లీ తెలవడం రాజద్రోహం కింద శిరచ్ఛేదనం ఉంటుంది కాబట్టి వాళ్లు తియ్యరు. అక్కడొక ముసలాయన్ని అడిగితే మూడు పక్కలా కోట గోడ ఉంది పడమటి దిక్కున కొండ ఉంది అక్కడ్నుంచి పోవాల్సిందే అని చెప్తాడు. నీ బిడ్డని ఆ భవానీ మాతే రక్షిస్తుంది అని ధైర్యం చెప్పబోతుంటే ఆమె అన్ని చోట్లా ఉండలేకే తల్లిని సృష్టించిందని చెప్పి తన బిడ్డను చేరుకోవాలనే తన దృఢ చిత్తాన్ని బయటపెడ్తుంది.

అక్కడికెళ్లి చూస్తే పెద్ద లోయ. అక్కడ్నుంచి వర్షం నీళ్లు మాత్రమే కిందికి రాగలుగుతాయి, గాలి మాత్రమే పైకెళ్లగలుగుతుంది అని చెప్పిన భర్త మాటలకు హిర్కానీ అయితే భయనడేదేమో గానీ తల్లి హృదయం ఇసుమంతైనా చెనకదు. అక్కడున్న వాన్ని కొట్టి వాడి తల గుడ్డ లాక్కుని కొండ దిగడం మొదలుపెడుతుంది.

కొంచెం దిగినాక కిందికి చూస్తే దిక్కుతెలీని యాతన. వాటికి పైనుంచి రాజోద్యోగులు పెద్ద పెద్ద రాళ్లూ, మంటలు తోసి ఇక పోయుంటుందిలే అనుకుంటారు. కానీ తల్లి హృదయాన్ని వాటిల్లో ఏ ఒక్కటి ఆపలేకపొయ్యాయి. తేనీటీగల దాడినెదుర్కుని, పాము బారి నుండి బయటపడి రక్తమోడుతూ, పడుతూ లేస్తూ ఇంటిదగ్గరికెళ్తుంది. ఎదురుగా భయంకరమైన కళ్ళతో తోడేలు. భర్త చెప్పిన మాటలు గుర్తుచేసుకుని దాన్ని చంపి లోపలికెళ్లి పిల్లోనికి పాలిస్తే గానీ ఆ తల్లి శాంతించలేదు.

ఈ తతంగమంతా రాజు గారికి తెలుస్తుంది. పిలిపిస్తాడు. ఆ కొండ చరియ దగ్గరికి తీసుకెళ్లి నీ ధైర్యం అద్భుతం నేను చూడాలనుకుంటున్నాను మళ్లీ ఒకసారి దిగు అని ఆజ్ఞాపిస్తాడు. కిందికి చూసే భయకంపితురాలై నన్ను మన్నించండి ప్రభూ నాకు భయమేస్తుందని వేడుకుంటుంది. మరి రాత్రెలా దిగగలిగావు అంటే అప్పుడు దిగింది నేను కాదు ప్రభూ ఒక బిడ్డ తల్లి అని వినమ్రంగా సమాధానమిస్తుంది. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చిన శివాజీ రాజు అక్కడ ఒక బురుజు కట్టి దానికి #హిర్కానీ_బురుజు అని పేరుపెట్టమని ఉద్యోగులను ఆదేశించి, ఆమె బిడ్డకు పేరు పెట్టి రాజ లాంఛనాలతో ఇంటికి సాగనంపుతాడు. కథ సుఖాంతం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp