TRP రేటింగ్స్ లో 'బిగ్' రికార్డు

By iDream Post Sep. 17, 2020, 01:38 pm IST
TRP రేటింగ్స్ లో 'బిగ్' రికార్డు

కొంచెం లేట్ గా వచ్చినా లేటెస్ట్ రికార్డుతో బిగ్ బాస్ సీజన్ 4 టిఆర్పి బూజు దులిపింది. ఓపెనింగ్ ఎపిసోడ్ కు ఏకంగా 18.5 రేటింగ్ తో నెవర్ బిఫోర్ ఫీట్ ని సాధించింది. నిజానికిది అంచనాలకు మించినదే అని చెప్పాలి. గత మూడు సీజన్లు హిట్టయినప్పటికీ ఏదో ఒక వివాదం లేదా అంశం వల్ల పెద్ద బ్లాక్ బస్టర్ స్థాయికి చేరలేకపోయాయి. ముఖ్యంగా నాని డీల్ చేసిన సిరీస్ కు చాలా విమర్శలు వచ్చాయి. మళ్ళీ నాగ్ చేతికి వచ్చాక కొంత కుదుటపడింది. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం నడిపే డ్రామా అని,. ఓటింగ్ కోసం సభ్యులు బయట ఆర్మీల పేరుతో క్యాంపైన్ చేస్తారని ఇలా ఎన్ని కామెంట్స్ వచ్చినా కొత్త సీజన్ ప్రకటన రాగానే ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతున్నారు.

దానికి తగ్గట్టే మొదటి ఎపిసోడ్ కు ఇంత బ్రహ్మాండమైన స్పందన దక్కింది. దీనికి కారణాలు ఉన్నాయి. కొందరు పార్టిసిపెంట్స్ పేర్లు ముందే లీకైనప్పటికీ అవి నిజమా కాదా అనే డైలమా ఆడియన్స్ లో ఉండేది'. దాంతో పాటు గంగవ్వ లాంటి ఆసక్తికరమైన సభ్యులు ఉండబోతున్నారని ముందే హింట్స్ రావడంతో వాళ్ళ ఎంట్రీ కోసం చూసినవాళ్ళే ఎక్కువ. అందువల్లే ఈ రికార్డు సాధ్యమయ్యింది. ఎలాగూ డాన్సులు, ఇంట్రోలు, హౌస్ పరిచయం లాంటి హంగామా ఉంటుంది కాబట్టి సహజంగానే ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అందులోనూ యాంకర్ గా నాగార్జున ఇమేజ్, దానికి అనుగుణంగా కట్ చేసిన ప్రోమోలు చాలా హెల్ప్ అయ్యాయి. అసలైన ఛాలెంజ్ బిగ్ బాస్ 4 ఇప్పుడు ఫేస్ చేస్తోంది.

ఆశించిన స్థాయిలో టెంపో లేదని, తెలియని ముఖాలతో అంతా ఓ ప్రహసనంగా ఉందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు జనాన్ని షో చూసేలా చేయడం అన్నింటిని మించిన టాస్క్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడీ ఓపెనింగ్ రేటింగ్ చూసుకుని మురిసిపోవడం కాదు కానీ ఆ క్రెడిట్ ని నిలబెట్టుకునేలా రాబోయే 90 ఎపిసోడ్స్ ని డిజైన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. గత వారం సూర్య కిరణ్ ఎలిమినేషన్, మొన్న కుమార్ సాయి ప్రవేశం అంతా చప్పగా సాగిపోయాయి. జబర్దస్త్ అవినాష్ ను కూడా రంగంలోకి దించబోతున్నారట. ఇవన్నీ వ్యూయర్స్ ఆకట్టుకునే ఎత్తుగడలే. ఇలా ఓపెనింగ్, గ్రాండ్ ఫినాలేకు మాత్రమే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ రేటింగ్స్ కాకుండా మిగిలిన సిరీస్ కు కూడా కనీసం అందులో సగం రేటింగ్ వచ్చిన దీన్ని సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఆ వివరాలు కూడా త్వరలో బయటికి రాబోతున్నాయి. చూద్దాం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp