దగ్గుబాటి హీరో కోసం మొదలైన వేట

By iDream Post May. 12, 2021, 01:00 pm IST
దగ్గుబాటి హీరో కోసం మొదలైన వేట

స్టార్ హీరోల కుటుంబాల నుంచి ఇండస్ట్రీ ఎంట్రీలు ఇప్పుడు మాములు విషయం. ఒకప్పుడు కేవలం కొడుకులు మాత్రమే వారసులుగా వచ్చేవారు. కానీ ఇప్పుడు మేనల్లుళ్లు, అల్లుళ్ళు, తమ్ముడి పిల్లలు, అన్నయ్య సంతానం ఇలా కాదెవరు సినిమాలకు అనర్హం అనే తీరులో అందరూ వచ్చేస్తున్నారు. అలా అని ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారని కాదు కానీ కనీస టాలెంట్, ఓ రెండు మూడు హిట్లు ఉంటే మాత్రం మంచి కెరీర్ దొరుకుతోంది. కాస్త మొహం జనానికి పరిచయం అయితే చాలు నిర్మాతలు సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారు. కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి మంచి ఆదాయ వనరులు సెట్ చేసుకుంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ తెరంగేట్రంకు తెరవెనుక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. తేజ దర్శకత్వంలో ఒక లవ్ ఎంటర్ టైనర్ తో లాంచ్ చేయాలని తండ్రి కం నిర్మాత సురేష్ బాబు ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిసింది. చిత్రం సీక్వెల్ ని తేజ గతంలో ప్రకటించారు కానీ అది అభిరాం కోసం కాదట. ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టేసి వేరే ఫ్రెష్ స్టోరీతో అభిరాంని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. అయితే స్క్రిప్ట్ విషయంలో ఇంకా అభిప్రాయం రాలేనట్టుగా కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో దానికి సంబంధించి ఇదంతా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఇటీవలే ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని అభిరామ్ కు జోడిగా అడిగితే తాను సున్నితంగా ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ ని చూపించి నో చెప్పినట్టు వార్త ఉంది. ఇదంతా క్లారిటీ రావాలంటే ఇంకో నెల లేదా రెండు నెలలు టైం పడుతుంది. నిజానికి అభిరాం ఇప్పటికే లేట్ చేసినట్టు. రానా కేవలం హీరో పాత్రలకే అని కట్టుబడకుండా తన నటనకు ఛాలెంజ్ అనిపించే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే డెబ్యూతోనే అభిరాం అలాంటి సాహసాలు చేయలేడు కాబట్టి సాఫ్ట్ ఎంట్రీ అవసరం. నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ తర్వాత సీత డిజాస్టర్ తో దెబ్బ తిన్న తేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఇది చాలా కీలకం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp