ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

By Press Note Dec. 23, 2019, 01:33 pm IST
ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో ఆది ఒక కొత్త్ పాత్రలో పరిచయం
కాబోతున్నాడు.

శివ శంకర్ దేవ్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో స్ర్కిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసిన దర్శకుడు శివ శంకర్ దేవ్ ఈ చిత్రంలో ఇప్పటి వరకూ తెలుగులో రాని కొత్త
కాన్సెప్ట్ ని తెరమీద చూపించబోతున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రంలోని ఇతర పాత్రల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

బ్యానర్స్: మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్ , చాగంటి ప్రొడక్షన్స్
డైరెక్టర్ : శివశంకర్ దేవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. సాయికిరణ్, ప్రతాని శ్రీనివాస్ గౌడ్, అనీల్ మైలాపురమ్, పి.ఆర్.ఓ. జియస్ కె మీడియా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp