ఇక్కడ నితిన్ - అక్కడ ఆ హీరోనా

By iDream Post Sep. 26, 2020, 02:54 pm IST
ఇక్కడ నితిన్ - అక్కడ ఆ హీరోనా

ఏదైనా హిట్ మూవీ బ్లాక్ బస్టర్ రీమేక్ చేయాలనుకున్నప్పుడు అందులో ఫామ్ లో ఉన్న స్టార్లు అయితేనే దానికి మంచి మార్కెట్ వస్తుంది. గత ఏడాది బాలీవుడ్ సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన అంధాదున్ ని నితిన్-నభ నటేష్ జంటగా తెలుగులో తీస్తున్న సంగతి తెలిసిందే. ఒక నెగటివ్ రోల్ కి తమన్నా ఎస్ చెప్పడం ఇప్పటికే సంచలనం రేపింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. దీన్ని తమిళంలో కూడా తీయబోతున్నారు. హీరో పేరు చెప్తే షాక్ కలగక మానదు.అతనే జీన్స్ ప్రశాంత్. ఒకప్పుడు లవర్ బాయ్ గా క్యూట్ లవ్ స్టోరీస్ చేసి చాలా కాలం నుంచే సోలో హీరోగా సక్సెస్ కు దూరంగా ఉన్నాడు.

గత ఏడాది రామ్ చరణ్ వినయ విధేయ రామలో పెద్దన్నయ్యగా నటించింది ప్రశాంతే. హీరో ఫీచర్స్ తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇతనికి ఇప్పుడీ ఆఫర్ రావడం విచిత్రమే. దర్శకుడిగా మోహన్ రాజా వ్యవహరించబోతున్నారట. కోలీవుడ్ లో ఈయనకు రీమేక్ స్పెషలిస్ట్ అని పేరుంది. ధృవ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ తీసింది కూడా రాజానే. అయితే ఇప్పుడీ కథకు ప్రశాంత్ ని ఎంచుకోవడం ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తోంది. ఇక్కడ నితిన్ అంటే మంచి ఫామ్ లో ఉన్న హీరో కాబట్టి మార్కెట్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. కానీ ప్రశాంత్ లాంటి యాక్టర్ ఇలాంటివాటికి అంతగా సూట్ కాడు. అందులోనూ మనిషి మునుపటిలా ఫిజిక్ తో లేడు. ఎన్ని కామెంట్స్ వస్తున్నా కూడా ప్రాజెక్ట్ అయితే పట్టాలు ఎక్కడం ఖాయం అంటున్నారు.

హీరోయిన్ల ఎంపిక మిగిలిన టీమ్ పనులు తదితరాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అందాదున్ లో హీరో పాత్ర దాదాపు సినిమా మొత్తం కళ్ళు లేకుండానే ఉంటుంది. కానీ ఊహించని థ్రిల్స్ చాలా ఉంటాయి. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే నితిన్ ఏరికోరి మరీ ఎంచుకున్నాడు. అందులోనూ బ్లైండ్ రోల్ అంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది కాబట్టి ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన జీన్స్ లో ఫ్రెష్ గా కనిపించిన ప్రశాంత్ ఇప్పుడు కూడా అదే తరహాలో కనిపించాలని తాపత్రయపడటం మంచిదే. అయితే మార్కెట్ బాగున్నప్పుడు అవన్నీ చెల్లుతాయి కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. మరి మోహన్ రాజా ఎలా చూపించి మెప్పించబోతున్నాడో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp