యుట్యూబ్ బామ్మకు మెగా ఆఫర్ వచ్చిందా

By iDream Post Oct. 04, 2021, 12:45 pm IST
యుట్యూబ్ బామ్మకు మెగా ఆఫర్ వచ్చిందా

యూట్యూబ్ లో వీడియోల ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన గంగవ్వ ఆ తర్వాత బిగ్ బాస్ 4 ద్వారా సామాన్య జనానికి కూడా బాగా దగ్గరయ్యింది. స్వచ్ఛమైన తెలంగాణ యాసలో విభిన్నమైన శైలిలో స్వంత బామ్మే మాట్లాడుతున్నంత స్వచ్ఛంగా అందరినీ పలకరించే గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీ స్థాయిలో పేరు తెచ్చేసుకుంటోంది. ఒకప్పుడు నెటిజెన్లకు మాత్రం సుపరిచితమైన ఈవిడ ఇప్పుడు సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. గంగవ్వను ఫిలిం మేకర్స్ ఒకరకంగా సెంటిమెంట్ గానూ ఫీలవుతున్నారు. నాగార్జున తనను ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం సోషల్ మీడియాలో బాగా కలిసొచ్చింది.

గంగవ్వ నటించిన చిత్రాలన్నీ దాదాపుగా హిట్ కావడం గమనార్హం. మల్లేశం కమర్షియల్ గా ఆడకపోయినా మంచి పేరు తెచ్చుకుని క్లాసిక్ గా మిగిలిపోయింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కాగా ఎస్ఆర్ కళ్యాణమండపం ఫలితం కళ్లారా చూశాం. సెకండ్ లాక్ డౌన్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్స్ లో ఒకటైన రాజరాజ చోరలోనూ ముఖ్యమైన పాత్ర దొరికింది. రీసెంట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీలోనూ గంగవ్వ మెరిసింది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు ఉన్నాయి కానీ అన్నింటిలోనూ అంతో ఇంతో ప్రాధాన్యం గుర్తింపు ఉన్న క్యారెక్టర్లే విశేషం. ఒక రెండు మూడు సీన్లయినా పర్లేదు తనుంటే చాలు అనుకుంటున్నా దర్శకులు చాలానే ఉన్నారు.

ఇలా వెండితెరపై గట్టిగానే నిలబడుతున్న గంగవ్వకు ఏకంగా మెగాస్టార్ తల్లిగా నటించే అవకాశం దక్కిందని ప్రచారం జోరందుకుంది. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో ఆ పాత్ర ఆఫర్ చేశారని అంటున్నారు. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో హీరోకు మదర్ సెంటిమెంట్ ఉండదు. మరి అదనంగా చిరు కోసం ఏమైనా జోడించారేమో తెలియదు. లేదూ భోళా శంకర్ కోసం అడిగారేమో క్లారిటీ రావాల్సి ఉంది. సరే అమ్మగా కాకపోయినా ఇంకో వేరే రోల్ ఏమైనా మెగాస్టార్ సినిమాలో నటించడం అంటే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. మొత్తానికి గంగవ్వ ఆర్టిస్టుగానూ బిజీ అవ్వడం చూస్తుంటే ఆవిడ సుడి మాములు దశ తిరగలేదనిపిస్తోంది

Also Read : నటరాజ్ మాస్టర్ అవుట్ - గేమ్ పేరుతో అర్ధనగ్న నృత్యాలు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp