ఆనందమా ఆందోళనా - హాళ్ల తెరిచివేత

By iDream Post Jun. 20, 2021, 04:30 pm IST
ఆనందమా ఆందోళనా - హాళ్ల తెరిచివేత

తెలంగాణలో ఇవాళ్టి నుంచి పూర్తిగా లాక్ డౌన్ ని ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సాయంత్రం పూట ఆంక్షలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో సహా రాష్ట్రం మొత్తం థియేటర్లు తెరుచుకోవచ్చని పర్మిషన్లు కూడా ఇచ్చేశారు. అయితే వాటికి సంబంధించిన నియమ నిబంధనలు, టైమింగ్స్ లాంటివి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సదరు యాజమాన్యాలు హాళ్లను రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. యాభై శాతానికి మించి సీటింగ్ ఆక్యుపెన్సీకి ఛాన్స్ లేనట్టే.ఒకవేళ కరోనా ఇలాగే పూర్తిగా తగ్గుముఖం పట్టే రోజులు కనక ఎక్కువ ఉంటే ఫుల్ కెపాసిటీలకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తారు. కానీ కొంచెం టైం పడుతుంది అంతే.

ఇదంతా బాగానే ఉంది కానీ అసలు జూలైలో విడుదలకు సిద్ధమయ్యే సినిమాలు ఏవో వేచి చూడాలి. అందరి కళ్ళు లవ్ స్టోరీ, టక్ జగదీశ్ లాంటి చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్న వాటి మీదే ఉన్నాయి కానీ బడ్జెట్ మూవీస్ మీద జనాలు ఆసక్తి చూపించడం కష్టమే. థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనేది పక్కనపెడితే పెద్దగా ఇమేజ్ లేని హీరోల సినిమాలకు ముందు లాగ పబ్లిక్ కొద్దిరోజులు రాకపోవచ్చు. ఇమేజ్ ఉన్న స్టార్ అయితేనే జనాన్ని హాలు దాకా రప్పించగలడు. మొన్న వకీల్ సాబ్ టైంలో వచ్చిన ఓపెనింగ్సే దానికి సాక్ష్యం. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం అధిక శాతం ప్రొడ్యూసర్లు ఆగస్ట్ కే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది.

నిన్నా మొన్న వచ్చిన క్రాక్, ఉప్పెన, జాతరత్నాలు లాంటి వాటితో థియేటర్లకు ఫీడింగ్ చేయడం కష్టం. వచ్చే ఆదాయం కన్నా వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్తో కూస్తో మార్కెట్ ప్లస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్ పాగల్ లాంటి సినిమాలు వేస్తేనే అంతో ఇంతో ఉపయోగం.సెన్సార్ కు సిద్ధంగా ఉన్న చెప్పుకోదగ్గ చిత్రాల సంఖ్య సుమారు ముప్పై కి పైగానే ఉంది. ఇవన్నీ దాదాపు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకున్నావే. మరి తేదీలు ప్రకటించడమే ఆలస్యం. నిర్మాతల మండలి ఈ విషయంలో చొరవ తీసుకుని క్లాషులు ఎక్కువ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేదా ఇంకో నెల తర్వాత వారానికి కనీసం అయిదారు సినిమాలు పోటీపడక తప్పని పరిస్థితి నెలకొంటుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp