మహా సన్మానాల మెగా జోష్

By iDream Post Sep. 27, 2020, 12:33 pm IST
మహా సన్మానాల మెగా జోష్

బిగ్ బాస్ 4 మూడో వీకెండ్ నిన్న వచ్చేసింది. దివంగత ఎస్పి బాలసుబ్రమణ్యంకు నివాళి అర్పించాక ఎప్పటిలాగే నాగార్జున తన ఎనర్జీతో హౌస్ లో ఫుల్ జోష్ తెచ్చారు. తాను ఈ షోకు ఎంత ప్రత్యేకమో ఆకర్షణో పదే పదే ఋజువు చేస్తున్నారు. ఈ స్టార్ అట్రాక్షనే కనక లేకపోతే ఇలాంటి రియాలిటీ షోలకు రేటింగ్స్ ఆశించడం కూడా అత్యాశే. ఇక అసలు విషయానికి వస్తే నిన్నంతా మంచి హుషారుగా నడిపించారు నాగ్. ట్రూత్ గేమ్ పేరుతో వాళ్ళ మనసులో ఉన్న మాటలు బయటికి రప్పించారు. హారికను నీకు కంపిటీటర్ కాదని ఎవరిని అనుకుంటున్నావు అంటే ఆమె ఠక్కున కుమార్ సాయి పేరు చెప్పేసింది. అభిజిత్ తనకు మధ్య ఏదో నడుస్తోందన్న పుకార్ల గురించి కూడా నేరుగానే అగిడేశారు నాగ్.

దేవి నాగవల్లి, మెహబూబ్ లు సైతం అదే పనిగా కుమార్ సాయిని టార్గెట్ చేసి తను గేమ్ కి పనికిరాడు అనేలా కామెంట్స్ చేసి షాక్ ఇచ్చారు. సోహైల్ కు మోనాల్ నారదుడు అనే బిరుదు ఇచ్చేసింది. లాస్య మోనాల్ ను అబద్దాల కోరు అని చెప్పడం గమనార్హం. అరియనా, సోహైల్ పరస్పరం ఒకరి మీద ఒకరు కోపాన్ని ప్రకటించేసుకున్నారు. ఇక కుమార్ సాయి అభిజిత్ ఫేక్ అని చెప్పడం ట్విస్ట్. ఇది అభిజిత్ అఖిల్ ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇక మహా ఉపమానంతో నాగార్జున పెట్టిన అవార్డుల ప్రహసనం కూడా సన్నీగా సాగింది. మహానాయకుడిగా అభిజిత్ ను నాగార్జున ప్రకటించగా అవినాష్ ను మహాకంత్రిగా హౌస్ ఎన్నుకుంది,. అమ్మ రాజశేఖర్ ని మోసం చేసినందుకు గాను ఇలా షాక్ ఇచ్చారు. గంగవ్వకు మహానటి బిరుదు దక్కింది.

ఆవిడ వీడియోను చూపించి నాగార్జున సర్ప్రైజ్ చేయడం విశేషం. ఇది మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఇచ్చింది. ఇక ఒక్కొక్కరిలో నెగటివ్ లక్షణాల గురించి అవతలి వాళ్ళను చెప్పమన్నప్పుడు అందరూ పోటీపడి మరీ నిజాలు అనేశారు. నోయెల్ అమ్మ రాజశేఖర్ ని ఎక్కువ బూతు జోకులు చెబుతున్నాడని కంప్లయింట్ ఇచ్చాడు. బయటికి వచ్చాక అఖిల్ ని దత్తత తీసుకుని పెళ్లి చేస్తానని గంగవ్వ చెప్పడం లాంటివి బాగున్నాయి. కొత్తగా వచ్చిన స్వాతి అప్పుడే లాస్యకు టార్గెట్ అయిపోయింది. ఫైనల్ గా లాస్య, మోనాల్ ఈ వారం ఎలిమినేషన్ల నుంచి తప్పించుకున్నారు. ఈ రోజు ఎవరు బయటికి వస్తారనేది సస్పెన్స్ గా ఉంది. మెహబూబ్, దేవిల మధ్య తేడా చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైనా జరగొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా లీక్స్ లో దేవి పేరు మారుమ్రోగిపోతోంది. మరి ఇది నిజమవుతుందో లేదో ఈ రాత్రికి తేలిపోతుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp