కెజిఎఫ్ 2 - షాక్ కు రెడీ అవ్వాలి

By iDream Post Apr. 04, 2020, 05:39 pm IST
కెజిఎఫ్ 2 - షాక్ కు రెడీ అవ్వాలి

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై భారీ ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న కెజిఎఫ్ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఒక కన్నడ సినిమా డబ్బింగ్ వెర్షన్స్ లోనూ అమోఘ విజయాన్ని సాధించడం చూసి ట్రేడ్ సైతం నోరెళ్ళబెట్టింది. రూపాయికి రెండు రూపాయలు గ్యారెంటీగా ప్రతి బయ్యర్ కు తిరిగి ఇచ్చిన కెజిఎఫ్ రెండో భాగం అక్టోబర్ 23న విడుదల కానున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తయిపోయింది కాబట్టి యూనిట్ టెన్షన్ పడటం లేదు. కరోనా ఎఫెక్ట్ అన్ని సినిమాల మీద ప్రభావం చూపిస్తున్నా కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే పెండింగ్ ఉన్న కెజిఎఫ్ 2కి అది పూర్తి చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది.

ఇదిలా ఉండగా ఇందులో కథ ఏమై ఉంటుందా అనే దాని గురించి ఇప్పటికే చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే బలంగా వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారం కెజిఎఫ్ 2 లో యాంటీ క్లైమాక్స్ ఉంటుందట. అంటే హీరో పాత్ర విషాదాంతంగా ముగుస్తుంది. ఇలాంటి మాఫియా నేపథ్యం కలిగిన కథల్లో ఎంత పెద్ద స్టార్ కైనా ఎండింగ్ ఇలాగే ఉంటుంది. క్లాసిక్ అనిపించుకున్న నాయకుడులో కమల్ హాసన్ పాత్ర ఓ పిచ్చోడి చేతిలో చనిపోతుంది. అదే గొప్పగా పండింది కూడా. ఇక కెజిఎఫ్ 2 విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీకి రాఖీ భాయ్ సైన్యానికి మధ్య జరిగే భీకర యుద్ధం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో షూట్ చేశాడట. గత కొన్నేళ్ళలో ఏ సౌత్ సినిమాలోనూ చూడనంత టెర్రిఫిక్ యాక్షన్ ఎపిసోడ్ ఇందులో ఉంటుందని వినికిడి.

ప్రధానిగా నటిస్తున్న రవీనాటాండన్ ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతుందని, రాఖీ భాయ్ ని పోలీసులతో ఎదురుకోలేమని గుర్తించి ఏకంగా స్పెషల్ ఫోర్సుని అక్కడికి పంపిస్తారట. విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ పాత్ర ప్రీ క్లైమాక్స్ కు ముందే ముగుస్తుందని సమాచారం. మొత్తానికి రాఖీ భాయ్ అంతం అభిమానులు ఊహించినదాని కన్నా పై లెవల్ లో ఉంటుందని శాండల్ వుడ్ టాక్. ఇప్పటికే బిజినెస్ పరంగా చాలా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్న కేజిఎఫ్ 2 భారీ విడుదలకు ప్లాన్ చేసుకుంటోంది. చాలా తెలివిగా దసరా డేట్ ని లాక్ చేసుకున్న కెజిఎఫ్ 2తో ఎవరు పోటీ పడతారో ఇంకా తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ ని కరోనా గోల సద్దుమణగగానే మొదలుపెట్టబోతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp