నాన్న ప్రేమ 'గాలి' కాదనే 'సంపత్'

By iDream Post Feb. 27, 2021, 11:16 am IST
నాన్న ప్రేమ 'గాలి' కాదనే 'సంపత్'

కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో తనదంటూ ఓ ముద్ర వేసి ఇప్పటిదాకా అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ఎఫ్3 చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనీష్ కృష్ణ దర్శకత్వంలో అనిల్ పర్యవేక్షణలో కథ స్క్రీన్ ప్లే మాటలు సమకూర్చడంతో పాటు సమర్పకుడిగా కూడా వ్యవహరించిన గాలి సంపత్ వచ్చే నెల విడుదల కాబోతోంది. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తుండగా శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నారు. లవ్లీ సింగ్ హీరోయిన్ గా చేస్తోంది. మేకింగ్ దశ నుంచే ఆసక్తి రేపుతూ వచ్చిన గాలి సంపత్ ట్రైలర్ ని ఇందాక రాజమౌళి ద్వారా విడుదల చేశారు.

నాటకాలన్నా వేషాలన్నా ప్రాణమిచ్చే సంపత్(రాజేంద్ర ప్రసాద్)కు నోట్లో అక్షరాలు పలకవు. ఉట్టి ఫాఫా అంటూ మాట్లాడితే దానికి పక్కనే ఉండే సత్య డబ్బింగ్ చెబుతూ ఉంటాడు. సంపత్ కొడుకు(శ్రీవిష్ణు)ఈ కారణంగా ఊళ్ళో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. తనకో ప్రియురాలు(లవ్లీ సింగ్)కూడా ఉంటుంది. అయితే ఒకదశ దాటాక సంపత్ వల్ల కొడుకు పరిస్థితి దారుణంగా మారుతుంది. ఈలోగా ఓ క్రైమ్ జరిగి సంపత్ పెద్ద ప్రమాదంలో పడి కనిపించకుండా పోతాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకదు. ఎక్కడో దిక్కుమొక్కు దొరకని చోట ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. మరి చివరికి ఆ తండ్రి కొడుకులు ఎలా కలుసుకున్నారు అనేదే కథ.

ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. విభిన్నమైన పాత్ర దొరికేసరికి రాజేంద్రప్రసాద్ మరోసారి చెలరేగిపోయాడు. కేవలం ఆయనను దృష్టిలో ఉంచుకునే అనిల్ రావిపూడి కథను రాసినట్టు కనిపిస్తోంది. శ్రీవిష్ణుకు మరోసారి మంచి క్యారెక్టర్ దక్కింది. తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు క్యాస్టింగ్ లో భాగంగా ఉన్నారు. దర్శకుడు అనీష్ కృష్ణ టేకింగ్ లో ఫ్రెష్ నెస్ ఉంది. అచ్చు సంగీతం, సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం సమకూర్చారు. శివరాత్రి పండక్కు విపరీతమైన పోటీ మధ్య మార్చి 11న వస్తున్న గాలి సంపత్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామెడీ లవర్స్ లో మంచి అంచనాలు రేపేలా ట్రైలర్ సాగింది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp