డ్రైవర్ నుంచి డాన్ దాకా

By iDream Post May. 12, 2020, 11:49 am IST
డ్రైవర్ నుంచి డాన్ దాకా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప షూటింగ్ కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయినప్పటికీ దీనికి సంబంధించిన ప్లానింగ్ మాత్రం మరోవైపు చకచకా జరిగిపోతోంది. కేరళలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్ లోనే మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆ మధ్య ఫస్ట్ లుక్ లో పుష్పగా బన్నీ మాస్ లారీ డ్రైవర్ లుక్ ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే తాజాగా మరొక అప్ డేట్ ఫ్యాన్స్ ఎగ్జైట్ చేసేలా ఉంది.

దాని ప్రకారం ఇందులో పుష్పరాజ్ అనే డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లింగ్ లో డ్రైవర్ స్థాయి నుంచి డాన్ దాకా ఎదిగే స్థాయిలో కొత్తగా ఉంటుందట. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తినడంతో స్టార్ట్ చేసి వాళ్ళను చంపే దాకా చాలా కొత్తగా ఉండేలా సుకుమార్ డిజైన్ చేశాడు. స్మగ్లర్ వీరప్పన్ మంచివాడిగా ఉంటే ఎలా ఉండేదన్న ఆలోచనే పుష్పకు శ్రీకారం చుట్టేలా చేసిందట .తెలుగులో ఇప్పటిదాకా డాన్ పాత్రలు అందరూ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ యుగంధర్ తో మొదలుపెట్టి చిరంజీవి లంకేశ్వరుడు దాకా ఎన్నో ఉన్నాయి. నేటి తరంలో కూడా ప్రభాస్ బిల్లా లాంటివి బాగానే ఆడాయి.

కానీ పుష్ప వాటికి భిన్నంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండటం వల్ల కొత్త అనుభూతి కలిగించడం ఖాయం. ప్రత్యేకంగా దీని కోసమే అల్లు అర్జున్, రష్మిక మందన్నలు చిత్తూరు స్లాంగ్ ని నేర్చుకుంటున్నారు. వీడియో కాల్స్ ద్వారా ట్యూటర్ తో రెగ్యులర్ గా కోచింగ్ జరుగుతోందట. మరో కీలక పాత్ర కోసం అనుకున్న విజయ్ సేతుపతి ఇందులో కంటిన్యూ అవుతాడా లేదా అనే సస్పెన్సు మాత్రం తొలగిపోలేదు. బాబీ సింహా అనే టాక్ వచ్చింది కానీ యూనిట్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేసుకున్న పుష్ప అనుకున్న ప్రకారం జూలై నుంచి తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసినా ఆ టైంకంతా రిలీజ్ కు రెడీ కావడం పెద్ద కష్టమేమీ కాదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp